నేడు ధర్మపురిలో హిందూ సమ్మేళనం !

J SURENDER KUMAR,

ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి లో ఆదివారం సాయంత్రం హిందూ సమ్మేళన కార్యక్రమం జరగనున్నది. బాలికల ఉన్నత పాఠశాల, వాటర్ ట్యాంకు సమీపానగల  బాలికల ఉన్నత పాఠశాల మైదానంలో సమ్మేళనం జరగనున్నది అని
హిందూ సమ్మేళన సమితి అధ్యక్షులు ఇమ్మడి శ్రీనివాస్  ప్రకటనలో తెలిపారు.

దేశానికి ఆత్మ హిందూ ధర్మం, హిందూ సంస్కృతి మరియు హిందూ సమాజం. కావున హిందూ సమాజాన్ని చైతన్యవంతం చేసి సమైక్యపరిచి మన దేశాన్ని తిరిగి విశ్వగురువుగా నిలపాలనే లక్ష్యంతో నేటి కాలమాన పరిస్థితుల్లో ఎదురౌతున్న అనేక సవాళ్ళను ఎదుర్కొనేందుకు హిందువుల ఐక్యత అవసరం అని ప్రకటనలో పేర్కొన్నారు.

హిందూ సమాజం పట్ల గౌరవభావం, ఏకత్మతా భావన, స్వధర్మం పట్ల అంకితభావం, సేవాగుణం వంటి వాటిని వికసింపచేసేందుకు మీ అందరి భాగస్వామ్యాన్ని కోరుకుంటూ హిందూ సమ్మేళనం ఏర్పాటు చేయడమైనది. ఈ హిందూ సమ్మేళన కార్యక్రమంలో  కుటుంబ సమేతంగా పాల్గొనాలని ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి  శ్రీ జగన్నాథం విష్ణువర్ధనాచార్యులు , ఉభయ వేదాంత పండితులు, ప్రధాన వక్త:  సామల కిరణ్ , ఆర్.ఎస్.ఎస్. విభాగ్ బౌద్ధిక ప్రముఖ్
మహిళా వక్త : శ్రీమతి నవత,  జాతీయవాద జర్నలిస్ట్, పాల్గొననున్నారు.