పాత్రికేయుడిని పరామర్శించిన  మంత్రి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

వార్త సేకరణ నిర్వహణలో జరిగిన తోపులాటలో తీవ్రంగా గాయపడ్డ పాత్రికేయుడిని ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ గురువారం జగిత్యాల ఆస్పత్రిలో పరామర్శించారు.

జగిత్యాలలో కేటీఆర్ పర్యటనలో భాగంగా జరిగిన తోపులాటలో మీడియా ప్రతినిధి Q న్యూస్ రిపోర్టర్ సాయి తీవ్రంగా గాయపడి కాలు విరిగింది. వెంటనే ఆయనను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈవిషయం తెలిసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల MLA సంజయ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నందయ్యతో కలిసి  బాధితుడు సాయిని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ గాయపడిన సాయికి ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.