రేషన్ షాప్ ను ప్రారంభించిన మంత్రి లక్ష్మణ్ కుమార్ !

J SURENDER KUMAR,

ఎన్నికల సమయం ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతామని  రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ధర్మపురి మున్సిపాలిటీ పరిధిలోని కోరండ్లపల్లిలో గురువారం నూతన రేషన్ దుకాణాన్ని మంత్రి  ప్రారంభించారు.

👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…….

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏలా ఉన్నప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  రేషన్ దుకాణాల ద్వారా సన్నీ బియ్యం పంపిణీ చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తామని మంత్రి తెలిపారు.


👉 మున్సిపల్ ఎన్నికల ప్రచారం సందర్భంగా కోరండ్లపల్లిలో రేషన్ దుకాణం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చామని ఇచ్చిన హామీ ప్రకారం నూతన రేషన్ దుకాణాలు ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు.

👉 గత ప్రభుత్వ కాలంలో ఏనాడు ప్రజా సమస్యలు పట్టించుకోలేదని మంత్రి ఆరోపించారు.

👉 కోరండ్లపల్లిలో కరెంటు పోల్స్ సమస్యతో పాటు పోచమ్మ గుడికి దారి మున్నూరు కాపు సంఘ భవనానికి నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చామని ఇందులో భాగంగా  రేషన్ దుకాణం ప్రారంభించామని మంత్రి తెలిపారు.

👉 మిగిలిన పనులు పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. గ్రామంలో అర్హులైన వారికి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తున్నామని మంత్రి తెలిపారు.

👉 మంత్రి వెంట ధర్మపురి మున్సిపల్ చైర్మన్ వేముల నాగలక్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంగనభట్ల దినేష్ తో వార్డు కౌన్సిలర్  తదితరులు పాల్గొన్నారు.