👉 మాజీ మంత్రి జీవన్ రెడ్డి పై జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాజంగి నందయ్య కౌంటర్ !
J.SURENDER KUMAR,
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు, గ్యాస్ సిలిండర్ ₹ 500 సబ్సిడీ, 200 విద్యుత్ బిల్లు మాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రేషన్ షాప్ లో సన్న బియ్యం , రైతులకు ₹ 2 లక్షల రుణమాఫీ సంక్షేమ పథకాలు అమలు చేసినందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగిపోవాలా ? చెప్పండి జీవన్ రెడ్డి గారు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గజంగి నందయ్య ప్రశ్నించారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలో మోతే రోడ్డులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డిసిసి అధ్యక్షుడు గాజంగి నందయ్య శనివారం మీడియాతో మాట్లాడారు..
👉 నందయ్య మాటలలో…
మీకు ఎమ్మెల్సీ రెన్యువల్ చేసి మంత్రి పదవి ఇచ్చి ఉంటే మీరు పార్టీకి రాజీనామా చేసేవారు కాదు కదా..? మీరే ప్రశ్నించారు మంత్రి పదవి నాకు ఎందుకు ఇవ్వలేదని..?
👉 మీ అనుచరులు డిసిసి అధ్యక్షుడు ₹ 20 లక్షలకు కౌన్సిలర్ టికెట్ అమ్ముకున్నాడని విమర్శిస్తే మీరు ఎందుకు వారించలేదు..? నాలుగు దశాబ్దాలుగా నా నిబద్దత మీకు తెలియదా..?
👉 కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎవరిని మీరు ఊరి పొలి మేర దాటనివ్వలేదు…రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా అవ్వకముందు కాంగ్రెస్ పార్టీ కొన ఊపిరితో వెంటిలేటర్ పై ఉంది.. దాన్ని రేవంత్ రెడ్డి ప్రాణాలతో బ్రతికించాడు..
👉 నాలుగు దశాబ్దాలుగా నేను మీ వెంటే ఉన్నా. పార్టీ ఎన్నడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు.. గౌరవంగానే చూసింది.. మీరు ఏ కార్యకర్తను కూడా శివారులో ధరూరు దాటినివ్వలేదు..
👉 గత 20 సంవత్సరాలుగా బిఆర్ఎస్ పార్టీని విమర్శించిన మీరు ఈరోజు కాలేశ్వరం లేకపోతే తెలంగాణనే లేదు అనే విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసమా..? కేవలం నెల రోజులలోనే బి ఆర్ ఎస్ పార్టీపై మీకెందుకు ఇంత ప్రేమ వచ్చింది..! ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీతో మీరు కలిసి పని చేయాలని కోరుతున్నాం..
👉 నేను నా భార్య, నాలుగు సార్లు పొలాస సర్పంచ్ గా గెలిచాము. 2014 లో మండల పరిషత్ అధ్యక్ష పదవి ఇవ్వకుండా ముంబైలో వ్యాపారం చేసే లక్ష్మీపూర్ కి కట్టబెట్టారు
👉 కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామని టిఆర్ఎస్ బిజెపి పార్టీలో సవాల్ చేస్తే. AICC ఆదేశాల మేరకు 10 మంది ఇతర పార్టీలో వారి మద్దతు తీసుకోవడం జరిగిందన్నారు.
👉 ఏదో వ్యక్తిగత అవసరాల నిమిత్తం మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, మీరు మునిసిపల్ చైర్మన్ చేసిన ఆడవాళ్ళ లక్ష్మి, ఎస్ సంజయ్ కుమార్ ను కలిస్తే. మీ అనుచరులు రచ్చ రచ్చ చేయడం మీకు తెలియదా ?
ఈ సమావేశంలో మున్సిపల్ చేర్ పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్, పిసిసి కార్యదర్శి గిరి నాగభూషణం, AMC మార్కెట్ చేర్మన్ నారాయణ రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
