రోడ్డు ప్రమాదంలో యువకుల మృతి బాధాకరం !

👉 మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు  యువకుల మృతి బాధాకరం, వారి తల్లిదండ్రుల గర్భశోకం ఎవరు తీర్చలేనిదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.

ధర్మపురి పట్టణ శివారులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ధర్మపురి పట్టణానికి చెందిన ముగ్గురు యువకులు మృతి చెందారు. మృతుల కుటుంబాలను గురువారం ఉదయం  మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి కి చేరుకొని మృతుల కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు

ఈసందర్భంగా ప్రమాదం జరిగిన తీరును పోలీసులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరపున ఆదుకుంటామని మంత్రి తెలిపారు. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి చర్యలు తీసుకోవాలని మంత్రి పోలీసులకు సూచించారు. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని మంత్రి పరిశీలించారు.

ఇదే ప్రమాదంలో  గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మంత్రి లక్ష్మణ్ కుమార్ పరామర్శించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని మంత్రి  వైద్యులను ఆదేశించారు.

మంత్రి వెంట జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంగనభట్ల దినేష్ తో పాటు ధర్మపురికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.