👉 రైతు శ్రేయస్సే రాష్ట్ర శ్రేయస్సు !
👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
రైతాంగం పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించి రైతాంగాన్ని అభివృద్ధి చేయడమే సంక్షేమమే మా ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని, రైతు శ్రేయస్సు రాష్ట్ర శ్రేయస్సు అని, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వయోవృద్దులు, వికలాంగులు మరియు ట్రాన్స్ జెండర్ సాధికారిత శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
గొల్లపెల్లి మండల కేంద్రంలో శుక్రవారం మంత్రి లక్ష్మణ్ కుమార్ , కలెక్టర్ బి. సత్యప్రసాద్ తో కలిసి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
👉 ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రైతుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. రైతుల సంక్షేమం మా ప్రాధాన్యత అని మంత్రి అన్నారు.
👉 జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని రైతులు తమ పంటను సంబంధిత కొనుగోలు కేంద్రంలో మద్దతు ధర వద్ద అమ్ముకోవాలని కోరారు.

👉 రైతులు పండించిన మొక్కజొన్న పంటలకు ప్రభుత్వం తగిన మద్దతు ధర ₹ 2400 రూపాయలు కల్పిస్తూ, ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
👉 రైతులు ఈ కొనుగోలు కేంద్రాలను వినియోగించుకొని, మధ్యవర్తులు లేకుండా నేరుగా తమ పంటను విక్రయించాలని మంత్రి సూచించారు.
👉 ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ....
జిల్లాలో ఈరోజు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించుకున్నామని మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో రైతులకు అవసరమైన అన్ని సదుపాయాలు అందుబాటులో ఉంచాల ని తెలిపారు. తూకం, నిల్వ, చెల్లింపుల ప్రక్రియలను వేగవంతంగా నిర్వహించి, రైతులకు సకాలంలో నిధులు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

రైతులు తమ పంటను శుభ్రంగా, తేమ శాతం ప్రమాణాలకు అనుగుణంగా తీసుకురావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీవో మధు సూదన్, మార్క్‌ఫెడ్ అధికారులు, తహసీల్దార్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, రైతులు మరియు తదితరులు పాల్గొన్నారు.
