రైతులకు మేలు జరిగేలా ప్రజాప్రతినిధులు కృషి చేయాలి !

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మొక్కజొన్న కొనుగోలు కేంద్ర ప్రారంభోత్సవంలో….

J.SURENDER KUMAR,

మొక్కజొన్న రైతులకు మద్దతు ధర కల్పించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొక్కజొన్న కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకొని మద్దతు ధర పొందాలని, రైతులకు మేలు జరిగేలా ప్రజాప్రతినిధులు కృషి చేయాలి అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.. గురువారం జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం వ్యవసాయ మార్కెట్ లో మార్క్ ఫెడ్ ద్వారా ఏర్పాటుచేసిన మొక్కల కొనుగోలు కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తో కలిసి ప్రారంభించారు.


👉 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…
..

జగిత్యాల జిల్లాలో  పెద్ద ఎత్తున మొక్కజొన్న సాగు చేశారని అన్నారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్ లో క్వింటాల్ మొక్కజొన్న రూపాయలు ₹1700 నుండి ₹1800 వరకు ధర పలుకుతుందని అన్నారు.

👉 కష్టపడి పండించిన మొక్కజొన్నకు గిట్టుబాటు ధర కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి జగిత్యాల జిల్లాలో 15 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరినట్లు మంత్రి తెలిపారు.

👉 మొదటిగా ఇబ్రహీంపట్నంలో కొనుగోలు కేంద్రం ప్రారంభించామని రానున్న రోజుల్లో జిల్లా వ్యాప్తంగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

👉 కొనుగోలు కేంద్రాల్లో క్వింటాలుకు ₹ 2400 మద్దతు ధర లభిస్తుందని జగిత్యాల జిల్లా రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పిలుపు నిచ్చారు.

👉 జిల్లాలోని వివిధ హోదాలో ఉన్న ప్రజా ప్రతినిధులు రైతులకు మేలు జరిగే విధంగా పని చేయాలని మంత్రి సూచించారు.

👉 రబి సీజన్లో రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు కు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. అధికారులు మిల్లర్లను సమన్వయం చేసుకొని ధాన్యం కొనుగోలు చేయాలని మంత్రి సూచించారు.

👉 ప్రజా ప్రభుత్వం  ఏర్పడిన నాది నుంచి ధాన్యం కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తుమని మంత్రి తెలిపారు. ధాన్యం విక్రయించిన ఐదు రోజుల్లో డబ్బులు ఏవిధంగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.

👉 ఇబ్రహీంపట్నం మార్కెట్ యార్డ్ లో రైతులకు ఇబ్బందులు లేకుండా సీసీ  ప్లాట్ ఫాం ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మంత్రి వెంట కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జీ జూవ్వాడి నర్సింగ రావు తదితరులు ఉన్నారు.