👉 శ్రీపాదరావు స్ఫూర్తితో శక్తివంతన లేకుండా పనిచేస్తాం !
👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J SURENDER KUMAR,
స్వర్గీయ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు ఆశయ సాధనలో శక్తి వంచన లేకుండా పనిచేస్తానని, ఆయన కాంస్య విగ్రహావిష్కరణ చేయడం నా అదృష్టం పూర్వజన్మ సుకృతం అని, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

మాజీ స్పీకర్ దివంగత నేత శ్రీపాదరావు 27వ వర్ధంతి వేడుకల్లో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి సోమవారం మంథనిలో శ్రీపాద కాలనీలో రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శ్రీపాదరావు వర్ధంతి వేడుకల్లో మంత్రి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.
👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ……

అజాత శత్రువుగా పేరున్న శ్రీపాద రావు ఈ రోజు జరిగిన దుస్స సంఘటనలో మృతి చెందడం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని మంత్రి అన్నారు.
👉 ఉత్తర తెలంగాణ జిల్లాలలో కాంగ్రెస్ కార్యకర్తలకు ఎవరికి కష్టం వచ్చినా శ్రీపాదరావు నేనున్నానంటూ కార్యకర్తల కష్టసుఖాల్లో భాగమయ్యారని మంత్రి అడ్లూరి అన్నారు.
👉 ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో జన్మించిన శ్రీపాద రావు ధన్వాడ సర్పంచ్ గా, మంథని సమితి ప్రెసిడెంట్ గా, మంథని ఎమ్మెల్యేగా సేవలు అందించారని అన్నారు.

👉 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గా పని చేసి స్పీకర్ పదవికి వన్నె తెచ్చారని మంత్రి అన్నారు శ్రీపాదరావు రాజకీయ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన శ్రీధర్ బాబు రాష్ట్ర రాజకీయాలతో పాటు, జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారారని, తనలాంటి సామాన్య కాంగ్రెస్ కార్యకర్తకు క్యాబినెట్ లో అవకాశం కల్పించిన గొప్ప వ్యక్తి మంత్రి శ్రీధర్ బాబు అని మంత్రి అడ్లూరి అన్నారు.

👉 మంత్రి శ్రీధర్ బాబు సహకారంతోనే రాష్ట్ర బడ్జెట్లో తన శాఖకు ₹ 17 వేల కోట్లు కేటాయించే అవకాశం తనకు దక్కిందని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
👉 ఎన్నికల సమయంలో ధర్మపురి ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు 2027లో నిర్వహించే గోదావరి పుష్కరాల వరకు ధర్మపురిలో బస్ డిపో ఏర్పాటు తో పాటు రెవెన్యూ డివిజన్ కేంద్రం, సబ్ ట్రెజరీ కార్యాలయం తదితర ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటుకు సహకరించాలని మంత్రి లక్ష్మణ్ కుమార్, మంత్రి శ్రీధర్ బాబును కోరారు.

👉 ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్, చింతకుంట విజయ రమణారావు, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు.

విగ్రహిష్కరణ సందర్భంగా రక్తదాన శిబిరం, పారిశుద్ధ్య కార్మికులకు, క్రీడాకారులకు బహుమతుల పంపిణీ తదితర కార్యక్రమం లకు మంత్రి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.
👉 శ్రీ పాద రావు సేవలు మరువలేనివి..!
స్వర్గీయ శ్రీపాద రావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన సేవలు మరువలేనివని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. స్వర్గీయ శ్రీపాదరావు 27వ వర్ధంతి సందర్భంగా జగిత్యాల జిల్లా ధర్మపురి మంత్రి క్యాంప్ కార్యాలయంలో శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలవేసి మంత్రి లక్ష్మణ్ కుమార్ నివాళ్లులు అర్పించారు.

శ్రీపాదరావు వర్ధంతి సందర్భంగా ధర్మపురి ప్రజల పక్షాన ఆయనకు నివాళులు అర్పిస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంగనభట్ల దినేష్ తో ధర్మపురి మున్సిపల్ కౌన్సిలర్లు, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
