J.SURENDER KUMAR,
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గౌరవార్థం శనివారం ఏర్పాటు చేసిన విందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జస్టిస్ సూర్యకాంత్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.
శంషాబాద్ లోని హోటల్ నోవాటెల్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విందు ఏర్పాటు చేశారు. విందులో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ , ఇతర న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు సీనియర్ సిటిజన్ లు హాజరయ్యారు.
