👉 రేపో మాపో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు!
J.SURENDER KUMAR,
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి నీ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో ఆ పార్టీ అగ్ర నాయకులు గురువారం జగిత్యాలో జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లి స్వాగతం పలికిన విషయం తెలిసిందే..
మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ఆదివారం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ తో భేటీ కానున్నట్టు సమాచారం.

టిఆర్ఎస్ లో చేరిక ప్రాంతం, తేదీ, సమయం, తో పాటు తన అనుచర గణం కు ప్రాధాన్యత, జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలలో కోరుట్ల మినహా జగిత్యాల, ధర్మపురి నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపిక బి ఫాం తదితర అంశాలపై ఆలోచనకు మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్లనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ప్రత్యేకంగా బిఆర్ఎస్ ప్లీనరీ సమావేశ ప్రాంతం వేదికతో పాటు. టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలకు కార్యాచరణ ప్రణాళిక కు చర్చలు చేపట్టనున్నట్టు సమాచారం. త్వరలో జరగనున్న జెడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికలలో జగిత్యాల జడ్పీ చైర్మన్ పీఠం టార్గెట్గా కార్యాచరణకు పావులు కదుపుతున్నట్టు సమాచారం.
