👉 అకాల వర్షంతో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన మంత్రి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR
అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, పంటలు చేతికి వచ్చే సమయంలో రైతాంగం నష్టపోవడం చాలా బాధాకరమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం భీమరాజు పల్లి గ్రామంలో ఆకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను మంత్రి లక్ష్మణ్ కుమార్ , వ్యవసాయ అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు.
దెబ్బతిన్న పంటలకు యుద్ధ ప్రాతిపాదికన సర్వే చేసి అంచనాలు సిద్ధం చేయాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు.
👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…..

ఆకాల వర్షాలకు జగిత్యాల జిల్లాలో 6160 ఎకరాల్లో మామిడి పంట, 1029 ఎకరాల్లో వరి, 1520 ఎకరాల్లో మొక్కజొన్న, 581 ఎకరాల్లో నువ్వు పంటలు దెబ్బ తిన్నట్టు అధికారులు ప్రాథమిక అంచనా వేశారని మంత్రి అన్నారు.
అధికారులు నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం వచ్చే విధంగా అంచనాలు రూపొందించి నివేదికను పంపించాలని మంత్రి మరోసారి అధికారులను ఆదేశించారు.
