👉 అభినందించిన మంత్రి లక్ష్మణ్ కుమార్ !
J SURENDER KUMAR,
2025-26 ఆర్ధిక సంవత్సరంలో ధర్మపురి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆదాయం ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం అధిగమించి జగిత్యాల జిల్లాలో మొదటి స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా మంగళవారం ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్, చిలుముల లావణ్య లక్ష్మణ్ తో పాటు పాలకవర్గాన్ని, కార్యదర్శిని అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంఘన బట్ల దినేష్ తదితర నాయకులు ఉన్నారు.
వ్యవసాయ మార్కెటింగ్ శాఖా ధర్మపురి మార్కెట్ కు ₹ 239.49 లక్షల పి వసూలు టార్గెట్ నిర్ణయించారు. ధర్మపురి మార్కెట్ యంత్రాంగం ₹ 382.46 లక్షలు మార్కెట్ ఫీజు వసూలు చేసి జగిత్యాల జిల్లాలో మొదటి స్థానములో నిలిచింది.
👉 మార్కెట్ అభివృద్ధికి ₹ 1.60 లక్షల నిధులు !
ధర్మపురి వ్యవసాయ మార్కెట్ అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల కల్పన కోసం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ₹ 1.60 లక్షల నిధులు విడుదల చేశారు.
మార్కెట్ కమిటి పరిధిలోని దుబ్బాల గూడెంలోని నాబార్డ్ గోదాము చుట్టూ ప్రహరి గోడ నిర్మాణము, మరియు మార్కెట్ యార్డు లోచైర్మన్ ఛాంబర్, సి.సి వర్క్ నిర్మాణమునకు నిధులు మంజూరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రిని మార్కెట్ కమిటి చైర్ పర్సన్ చిలుముల లావణ్య లక్ష్మణ్ , వైస్ చైర్మన్ సంగ నర్సింహులు , సభ్యులు శ్రీమతి వాంకుదోత్ గీతాంజలి , గంధం రాజయ్య , కాశెట్టి రాజు, గునిశెట్టి అంజయ్య , మార్కెట్ కమిటి కార్యదర్శి డి. శ్రీనివాస్ రావులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
.
