వైభవం మంత్రి లక్ష్మణ్ కుమార్ జన్మదిన వేడుకలు !

👉 భారీగా తరలివచ్చిన అభిమానులు కాంగ్రెస్ శ్రేణులు..!

👉 క్రేన్ తో మంత్రికి గజమాల వేసి అభిమానం చాటుకున్న శ్రేణులు !

J.SURENDER KUMAR,

నియోజకవర్గ కేంద్రమైన ధర్మపురి పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో బుధవారం రాత్రి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.

జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ తోపాటు జగిత్యాల జిల్లాకు చెందిన పలువురు అధికారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మంత్రి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా వేద పండితులు, అర్చకులు, మంత్రి లక్ష్మణ్ కుమార్ కు ఘనంగా వేద ఆశీర్వచనం అందించారు.

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం స్థానిక కాంగ్రెస్ శ్రేణులు మంత్రి లక్ష్మణ్ కుమార్, పేరిట అర్చనలు ,అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

నియోజకవర్గంలోని వెలగటూర్, ఎండపల్లి, గొల్లపల్లి, ధర్మారం, పెగడపల్లి, బుగ్గారం మండలలోని వివిధ గ్రామాల నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు  కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, కౌన్సిలర్లు భారీ సంఖ్యలో తరలివచ్చి మంత్రి లక్ష్మణ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపారు.

👉 గజమాలతో..


మంత్రి లక్ష్మణ్ కుమార్ అభిమానులు కాంగ్రెస్ శ్రేణులు, భారీ  గజమాలను క్రేన్ సహాయంతో మంత్రికి వేసి తమ అభిమానం చాటుకున్నారు.  కాంగ్రెస్ శ్రేణులు  బాణాసంచా కాలుస్తూ, ఉత్సాహంగా నృత్యాలు చేశారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో వేలాది మందికి భోజనాలు ఏర్పాటు చేశారు.

👉 నోట్ బుక్కులు బహుకరించిన చైర్ పర్సన్ !

పుట్టినరోజు వేడుకలలో శాలువాలు, పూల బొక్కేలు వద్దని మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి ప్రకటించారు.. ఈ నేపథ్యంలో స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ వేముల నాగలక్ష్మి ఆధ్వర్యంలో 200 నోట్ బుక్కులు, రెండు వందల వెన్నులను మంత్రికి అందించారు.

👉 మీ ప్రేమానురాగాలు ఎల్లకాలం ఇలానే ఉండాలి !

జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి మంత్రి లక్ష్మణ్ కుమార్ కృతజ్ఞతలు తెలుపుతూ తనపై మీ ప్రేమానురాగాలు ఎల్లకాలం ఇలాగే కొనసాగాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ మరోసారి కృతజ్ఞతలు తెలిపారు.