“బీర్పూర్”మందుపాతర కు 32 ఏళ్లు!

పచ్చని అడవి ఆకులపై చిందిన రక్తం ఎర్రని వర్షధారగ పారింది. కాకులు దూరని కారడవి చెట్ల కొమ్మలకు మానవ మాంసపు ముద్ద లు పండ్లుగా, పువ్వులుగా చిక్కి వెళ్లాడా యి. ఎగిరిపడ్డ తలలు మాంసపు ముద్దలు పచ్చని చెట్లు గల అడవి ప్రాంతం రక్తసిక్తమై యుద్ధభూమిగా మారింది. తెగిపడిన తలలు కాళ్లు చేతులు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వారు ఆదుకోండి అని వారు చేస్తున్న ఆర్తనాదాలతో అడవితల్లి మౌనంగా ప్రేక్షక పాత్ర లో నిలిచింది. తమ ఆత్మీయుడు మరణవార్త తెలిసి ఆదరాబాదరాగా వస్తున్న మృతుడి ఆత్మీయ బంధువుల ఆయుష్షు ఆవిరైంది. నక్సల్ మందుపాతర కు సంఘటనా స్థలంలో14 మంది ప్రాణాలు కోల్పోవడం కాకుండా వారి కుటుంబాలు చెల్లాచెదురయ్యాయి. అదృష్టవశాత్తు పోలీసు అధికారులకు ముప్పు తప్పిన. గురితప్పిన నక్సల్స్ మందుపాతర సంఘటన వారి ఉద్యమ చరిత్రలో మాయని మచ్చగా మిగిలింది.ఉమ్మడి రాష్ట్రంలో నక్సల్స్ పేల్చిన తొలి మందుపాతర సంఘటన కు రేపటికి 32 ఏళ్లు!

“”వివరాలు లోకి వెళితే!

నక్సల్స్ కంచుకోట ఆయన జగిత్యాల డివిజన్ లో తమ కార్యకలాపాలను అడ్డుకుంటూ తమ నాయకుల ను ఎన్కౌంటర్ చేస్తున్నారని ఉద్దేశంతో అప్పటి జగిత్యాల డిఎస్పి వేణుగోపాలకృష్ణ ,సీఐ నర్సింగరావు లను మట్టు పెట్టేందుకు తొలిసారి పేల్చిన మందు వికటించి 14 మంది అమాయకులు మృతి చెందిన విషయం తెలిసిందే.

బీర్పూర్ సారంగాపూర్ రహదారి ఘాట్ రోడ్డు దిగువ భాగంలో మెటల్ రోడ్డులో అమర్చిన 7 మందుపాతరల ఒకటి పెల్చగా అది వికటించడంతో మరో 6 మందుపాతరలు నక్సల్స్ వదిలివెళ్లారు.బీర్పూర్ నుండి సారంగాపూర్ జగిత్యాల వెళ్లే ఘాట్ రోడ్డు ఆరంభంలో వంతెన సమీపంలో మెటల్ రోడ్డును తవ్వి నక్సల్స్ 7 మందుపాతర లను అమర్చారు. వాటికి వైర్ ద్వారా కనెక్షన్ ఇచ్చి 30 మీటర్ల దూరం గుట్టపై రహస్య ప్రదేశంలో స్విచ్ బోర్డు ను కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకున్నారు. వారు ఎవరికీ కనిపించకుండా చుట్టూ చెట్ల కొమ్మలు ఆకులను కప్పి ఉంచారు. రహదారిపై అమర్చిన మందుపాతర పైనుంచి రాకపోకలను స్పష్టంగా కనిపించేలా ఆ కంట్రోల్ రూమ్ లో కొందరు నక్సల్స్ మకాం వేశారు. కంట్రోల్ రూమ్ పైన గల చెట్టు కొమ్మకు ఓ గంట ను సన్నని తాడుతో వేలాడదీశారు .దాదాపు 550 మీటర్ల దూరం రోడ్డు అంచు వరకు తాడును సెంట్రీ కి . అప్పగించారు. పోలీస్ అధికారులు ప్రయాణిస్తున్న వాహనం వస్తుండగానే తాడును లాగి కంట్రోల్ రూమ్ లోని గంట మోగించి తమను అప్రమత్తం చేయాల్సిందిగా సెంటర్ కి నక్సల్స్ ఆదేశాలు జారీ చేశారు. కేవలం నాలుగు నిమిషాల వ్యవధిలోనే కిల్లర్ జోన్లోకి వాహనం రాగానే పేల్చడానికి పక్క పథకాన్ని రూపొందించారు.

మందు పాతర పేలింది ఇక్కడే.


Like



Comment


Share

పోలీస్ ఉన్నతాధికారులను బీర్పూర్ గ్రామానికి రప్పించడం కోసం !1989 ఆగస్టు 31న రాత్రి ఐదుగురు నక్సల్స్ బీర్ పురం గ్రామానికి చేరుకున్నారు వివాద రహితుడు సౌమ్యుడు వృద్ధుడు అయిన మాజీ పట్వారి వంగ పెళ్లి తిరుపతిరావు (65) ఇంటి తలుపు తట్టి బయటకు పిలిపించారు ( వార్ అగ్రనేత గణపతి సమీప బంధువు తిరుపతి రావు) తిరుపతి రావు ను దారుణంగా హతమార్చి తల్వార్ తో తలను మొండెం నుంచి వేరు చేసి 10 మీటర్ల దూరంలో ఉంచారు. అదే రాత్రి ఘాట్ రోడ్ లోని కంట్రోల్ రూం వద్దకు చేరుకొని పోలీసు అధికారులకు రాక కోసం వేచి ఉన్నారు.

తెల్లవారు దాదాపు 10 11:00 సమయంలో సెప్టెంబర్ 1 1989 రోజున తిరుపతిరావు బంధువులు అద్దె వాహనంలో జగిత్యాల నుండి సారంగాపూర్ మార్గం గుండా బీర్పూర్ కు పయనమయ్యారు. జీప్ కిల్లర్ జోన్లోకి రాగానే ఒకేసారి గాలిలోకి 30 ఫీట్ల పైకి లేచి కింద పడింది అందులో ప్రయాణిస్తున్న వారు చెల్లాచెదురుగా ఘాట్ రోడ్ అడవులను చెట్లపై వాగుల్లో పడిపోయారు. డ్రైవర్ మాత్రం 5 సీట్లు ఎత్తునుండి కిందపడి రోడ్డుపై రక్త గాయాలతో పడి ఉన్నాడు.

అరే మీరా!

పోలీస్ అధికారులు ప్రయాణిస్తున్న జీప్ అనుకొని ముందుగా ఒక మందుపాతర పేల్చారు గాలి లోకి ఎగరడం తో వారు సామాన్య ప్రజలుగా గుర్తించారు మరో ఆరు మందుపాతరలు పేల్చకుండాకంట్రోల్ నుంచి సంఘటన స్థలం వద్దకు నక్సల్స్ చేరుకున్నారు. అరే మీరా మేము పోలీసు అనుకున్నాం అంటూ రోళ్ల వాగు వైపు నడుచుకుంటూ వెళ్లారు వారు లుంగీలు ధరించి ఉన్నట్టు ఆనాడు చర్చ . సంఘటనా స్థలంలో కాకుల మర్రివిద్యాసాగర్రావు, కాకుల మరి వనజ. సరిత , శశిధర్. వంగ పెళ్లి శ్రీ రంగారావు, శాంతాదేవి వెంకట్రావు విజయ ( yachamaneni) మోతుకూరి నరసయ్య. సాగి వసంతకుమారి , వంగ పెళ్లి సత్యం రావు, రేణుక సాగి నీరజ లు ప్రాణాలు కోల్పోయారు.

ప్రాణాలతో బయట పడింది వీరే!

వాహనంలో ప్రయాణిస్తున్న వారి సంఖ్య అధికం కావడంతో ముందు సీట్లో కెపాసిటీ కి మించి కూర్చోవడంతో డ్రైవర్ రాజము. డ్రైవింగ్ సీటు వైపు అంచు పై కూర్చుండి డ్రైవ్ చేస్తున్నాడు ఒకేసారి జీప్ ఎగరడం తో ఆయన అదుపుతప్పి 5 అడుగుల ఎత్తు నుంచి రోడ్డుపై పడ్డాడు. అదే జీపులోఎవరి ఒడిలోన వెనుక వైపు కూర్చుండి ఉన్న చిన్నారి వంగపల్లి అశ్విని (😎 వాహనంతో పాటు గాలిలో ఎగిరి కల్వర్టు పక్కన గల వాగు ఇసుక తిన్నెలపై పడి తలకు రక్త గాయం కావడంతో స్పృహ కోల్పోయింది.. వార్త సేకరణకు సంఘటనా స్థలాన్ని అందరికన్నా ముందుగా చేరుకున్న నేను నా స్నేహితులకు ముందుగా డ్రైవర్ రాజం రోడ్డు పై రక్త గాయాలతో అగుపించాడు .”” ఏమి జరిగిందో తెలియని స్థితిలో సార్ నా జీప్ టైర్ పేలిపోయింది ఏమైందో తెలియడం అంటూ రాజన్ రోదించాడు.

“”రోడ్డు కింద కల్వర్టు వాగు ఒడ్డున గల ఇసుకతిన్నెలపై తలకు రక్తం తో పడి ఉన్న అశ్విని మూలుగులు విని ఆ పాప వద్ద కు నేను నా స్నేహితులు చేరుకొని ముందుగా ఆమెను ఎత్తుకొని రోడ్డుపైకి వచ్చి ద్విచక్ర వాహనం పై కూర్చుండి ఘాట్ రోడ్ నుంచి బీర్పూర్ వైపు ప్రయాణం మొదలుపెట్టాం. రెండు కిలోమీటర్లు చేరేసరికి గ్రామస్తులు పోలీస్ అధికారులు సంఘటన స్థలం వైపు పరిగెత్తుకుంటూ వస్తున్నారు.ఆ పాపను వారికి అప్పగించి ద్విచక్ర వాహనం పై తిరిగి సంఘటనా స్థలానికి చేరుకొని నేను నా స్నేహితుడు వార్తా సేకరణ మొదలుపెట్టాం. నక్సల్స్ పేల్చిన జీపు నీలిరంగు పోలీస్ వాహనం తరహాలో కలిగి ఉండటం జీప్ ముందు భాగం పోలీస్ అని వ్రాసి ఉన్న చోటు “”టార్జాన్ “” అని రాసి ఉండడంతో నక్సల్స్ పోలీస్ వాహనంగా భావించి ఉండవచ్చు అనే అనుమానాలు ఉన్నాయి.

పోలీస్ అధికారులకు ముప్పు తప్పింది ఇలా !!

తిరుపతి రావు ను నక్సల్స్ హతమార్చిన సమాచారం అందుకున్న అప్పటి జగిత్యాల్ డిఎస్పి వేణుగోపాలకృష్ణ, సర్కిల్ ఇన్స్పెక్టర్ నర్సింగరావు లు జగిత్యాల నుంచి ఉదయం దాదాపు 9 -10 గంటల సమయం లో బీర్పూర్ గ్రామానికి బయల్దేరారు. శ్రీ నరసింహ రావు డ్రైవింగ్ చేస్తుండగా డిఎస్పి ముందర వెనుక భాగం లో గన్మెన్లు కూర్చున్నారు. జగిత్యాల నుంచి బీర్పూర్ కు చేరుకోవడానికి రెండు దారులు ఉన్నాయి. జగిత్యాల కు నాలుగు కిలోమీటర్ల దూరంలో గల తిప్పన పేట గ్రామం ( భారత్ మాత అంటారు). మరో మార్గం ధర్మపురి గుండా ఉంది. హత్య సంఘటన సంబంధించిన వివరాలు చర్చించుకుంటూ పోలీస్ అధికారుల వాహనం పొలా సా వరకు చేరుకుంది. అవే మాటల సందర్భంలో దగ్గర రహదారి వదిలి ఇంత దూరం వచ్చాం అంటూ వారు చర్చించుకున్నారు. తిరిగి వెనక్కి వెళ్ళి ఆ దారిగుండా వెళ్ళడానికి అంతే దూరం పడుతుంది ధర్మపురి నుంచే వెళ్దాం అంటూ ఇద్దర పోలీసు అధికారులు నిర్ణయించుకోవడంతో వారితో పాటు వారి గన్ మాన్ లకు కూడా ముప్పు తప్పింది. జగిత్యాల ధర్మపురి దారిలో వై జంక్షన్ తిప్పన పేట గ్రామం నుంచి ఉంది. ఈ దారిగుండా పెంబట్ల కోనాపూర్ సారంగాపూర్ ఘాట్ రోడ్డుపై నుంచి బీర్కుర్ చేరుకోవడానికి అతి తక్కువ దూరం అవుతుంది.

బయటి ప్రపంచానికి తెలిసింది ఇలా!

తిరుపతిరావు బంధువులు వాహనంలో లో ప్రయాణిస్తుండగా మరికొందరు వెనక ద్విచక్ర వాహనాల ద్వారా బీర్పూర్ కు పయనమయ్యారు. తమ ముందు వెళుతున్న వాహనం గాలిలోకి లేచి పోవడం సాయుధులైన కొందరు కొండ దిగడంతో ఆ దృశ్యాన్ని చూసిన ద్విచక్ర వాహనదారులు వెనక్కి సారంగాపూర్ వైపు పరిగెత్తారు. జరిగిన తీరుతెన్నులను సారంగాపూర్ పోలీస్ స్టేషన్ తెలిపారు. నాడు సెల్ ఫోన్ , వ్యవస్థ గాని ల్యాండ్ ఫోన్ వ్యవస్థ గాని అందుబాటులో ఆ ప్రాంతంలో లేవు. సారంగాపూర్ పోలీస్ స్టేషన్ నుంచి వైర్ లెస్ సెట్ ద్వారా ధర్మపురి పోలీస్ స్టేషన్ కు నక్సల్స్ మందుపాతర పేల్చారు అంటూ బీర్పూర్ లో ఉన్న డిఎస్పి సీఐలను ఆ దారి గుండా రాకుండా సమాచారం ఇవ్వాల్సిందిగా అప్రమత్తం చేశారు.

ధర్మపురి పోలీస్ స్టేషన్ లో ఉన్న హెడ్కానిస్టేబుల్ లక్ష్మీ రాజం సమాచారం అందుకుని రోదిస్తూ పోలీస్స్టేషన్ బయటికి పరిగెత్తుకుంటూ వచ్చి రహదారిపై ద్విచక్ర వాహనదారులను సార్ మా డిఎస్పి సిఐలు బీర్పూర్ లో ఉన్నారు అట్నుంచి వారు సారంగాపూర్ ద్వారా జగిత్యాల కి వెళ్తారు అక్కడ నక్సలైట్లు మాటువేసి ఉన్నారని చెప్పండి అంటూ ప్రతి ఒక్కరిని ప్రాధేయ పడటం అగుపించింది. బీర్పూర్ లో హత్య ఉదంతం తో పాటు డిఎస్పి సిఐలు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన తీరుతెన్నులను వార్త ఫోటోలను నేను సేకరించి నా స్నేహితులు ద్విచక్రవాహనంపై ధర్మపురికి చేరుకుంటున్న తరుణంలో హెడ్ కానిస్టేబుల్ మమ్మల్ని అడ్డుకొని దయచేసి మీరు వెళ్లి ఈ సమాచారాన్ని మా డీఎస్పీ సీఐ కి చెప్పండి అంటూ ప్రాధేయపడ్డాడు.

నేను నేను మిత్రుడు నల్ల కృష్ణా రెడ్డి కందాల నరసింహమూర్తి వేగంగా ద్విచక్ర వాహనం పై భీర్పోర్ చేరుకొని డి ఎస్ పి సి లకు నక్సల్స్ పేల్చిన మందుపాతర ఉదంతాన్ని వివరించాము. ఈ సమయంలో డిఎస్పి సిఐ వేణు గోపాల కృష్ణ నర్సింగరావు లు విచారణ ముగించుకొని జీవో లో కూర్చోవడానికి సిద్ధమయ్యారు . మేము చేరుకొని జరిగిన ఉదంతం వివరించడంతో సిఐ నర్సింగరావు అబ్బా అ వాళ్ళు దెబ్బ కొట్టారు సార్ అంటూ డి ఎస్ వై పు చూసి ఆయుధం చేతపట్టుకొని సార్ అక్కడికి వెళ్దాం అంటూ జీపులోలో కూర్చో పోయాడు. డిఎస్పి నర్సింగరావు వారించి ఆగు వాళ్ళ ప్లాన్ ఏంటో అర్థం కాదు కొంచెం నిదానంగా ఆలోచించి వెళ్దాం అన్నారు.

ఇదే సమయంలో కొలువై గ్రామానికి చెందిన శంకర్ లింగం ద్విచక్ర వాహనం పై జగిత్యాల వెళ్తుండగా ఘాట్ రోడ్డుపై నుంచి కిందికి దిగుతుండగా జీప్ పేలిన సంఘటనచూసి తిరిగి బీర్పూర్ వైపు వచ్చి ఇదే విషయాన్ని తెలిపాడు. పోలీస్ అధికారులు సురేందర్ ముందు నువ్వు ద్విచక్రవాహనంపై వెళ్లి ఈ పరిస్థితిని గమనించి మాకు సమాచారం తెలుపు . అంటూ ప్రజలను గ్రామస్తులను వెంటపెట్టుకొని వాహనాల ద్వారా ఘాట్ రోడ్ వద్దకు చేరుకొని కాలినడకన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. శవాలను మార్చురీకి క్షతగాత్రులను వాహనాల ద్వారా ఆసుపత్రులకు తరలించి నక్సల్స్ ఏర్పాటు చేసుకున్న కంట్రోల్ రూమ్ ను స్వాధీనం చేసుకొని మిగతా ఆరు మందుపాతరలు నిర్వీర్యం చేశారు.

ఈ సంఘటన కు రెండు రోజుల ముందు నక్సల్స్ అటవీ గ్రామాల్లో ఎవరు వారంరోజులపాటు అడవుల్లోకి రావద్దంటూ ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రచారం చేసినట్టు సమాచారం..

( సురేందర్ కుమార్ జె . ధర్మపురి )

ప్రత్యేక కృతజ్ఞతలు!

మిత్రులు చెట్నేని విజయ్ కుమార్, ( బీర్పూర్)గొల్లపల్లి గణేష్ (ధర్మపురి) చీటీశ్రీనివాసరావు (చందోలి) నన్ను పదేపదే సార్ మీ మూడున్నర దశాబ్దాల జర్నలిజంలో ఆ నాటి ప్రధాన సంఘటనలు నేటి సమాజానికి ఉపయోగపడే వార్తాకథనాలను ఫేస్ బుక్ లో ప్రచురించండి అంటూ వారితో పాటు మరి కొందరు మిత్రులకు నన్ను ప్రోత్సహించిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు వారి కోరికమేరకు నా సాధ్యమైనంతవరకు వార్తాకథనాలను అందించడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను.ప్రత్యేక కృతజ్ఞతలు! నా చిరకాల మిత్రుడు సీనియర్ జర్నలిస్టు సాక్షి దినపత్రిక మాజీ సీనియర్ సబ్ ఎడిటర్ మహమ్మద్ ఫజల్రెహమాన్ గారు “” కలల కరచాలనం “” శీర్షికలు నన్ను ఇంటర్వ్యూ చేసి నాలో గల జర్నలిస్టు ను తట్టి లేపి ప్రోత్సహించినందుకు ఆయనకు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు.***