69 వ సంవత్సరంలోకి సీఎం కేసీఆర్.


” ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రజాక్షేత్రంలో ప్రళయకాల  రుద్రుడిలా , తాండవం చేసి, ప్రపంచవని దృష్టిని ఆకర్షించి, అజరామర, కీర్తి పొందిన దిగ్గజం ఆయన.  ఆయన  ఓ చరిత్ర …  ఆయనే  మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు.”
కెసిఆర్ 1954, ఫిబ్రవరి 17న జన్మించారు. ఈనెల 17 నాటికి ఆయన 69 సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నారు. కెసిఆర్ జాతకచక్రంలో గ్రహబలలు జోరుగా ఉన్నాయనేది జ్యోతిష్య పండితులు కథనాలు,  సీఎం కేసీఆర్ జన్మ నక్షత్రం ఆశ్లేష, కర్కట రాశి, మేష లగ్నంలో జన్మించారు.


కెసిఆర్ కు అచ్చి వచ్చిన ” ఫిబ్రవరి”  మాసం !


1954, ఫిబ్రవరి 17 న జన్మించిన కెసిఆర్ కు ఆ మాసం చాలా సందర్భాల్లో  అచ్చి వచ్చిందనే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి సంఘటనలు, సందర్భాలు, కాకతాళీయంగా జరిగిన సమాజంలో చర్చ నెలకొంటుంది.
* 2014 ఫిబ్రవరి 13న తెలంగాణ బిల్లు లోక్ సభలో ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం.
* 2014  ఫిబ్రవరి 18న లోక్ సభలో తెలంగాణ బిల్లు ఆమోదం.
* 2014 ఫిబ్రవరి 20న రాజ్యసభలో బిల్లు ఆమోదం.
* 2014 ఫిబ్రవరి మాసం లోనే రాష్ట్రపతి ఆమోదం కోసం తెలంగాణ  బిల్లును పంపడం.
* 2010 ఫిబ్రవరి 9న  కేంద్ర ప్రభుత్వం ” శ్రీకృష్ణ కమిటీ” ఏర్పాటు తదితర అంశాలు ప్రస్తావనార్హం.
కలిసివచ్చిన దేశ, రాష్ట్ర, జెండా పండగ రోజులు !!
* సీఎం కేసీఆర్ తొలిసారి ఆగస్టు 15న జాతీయ జెండాను గోల్కొండ కోటపై ఎగుర వేసిన రోజు శుక్రవారం.
*  1947 ఆగస్టు 15న ఎర్రకోటపై తొలి భారత ప్రధాని  నెహ్రూ  జాతీయ పతాకం ఎగరవేసిన రోజు శుక్రవారమే.
దీనికితోడు 1947 ఆగస్టు, 2014 ఆగస్టు మాసంలో ఒకే వారం ఒకే తేదీలు కలిసిరావడం గమనార్హం.
దీనికితోడు 1954 వ సంవత్సరం ఫిబ్రవరి 17 విజయ నామ సంవత్సరంగా ( తెలుగు సంవత్సరాలలో) ఆ రోజు మాఘ పౌర్ణమి కావడంతో. ( అమావాస్య నాడు ఆడపిల్ల, పున్నమి, నాడు మగపిల్లవాడు పుట్టడం వారి అదృష్ట జాతకులు గా  జీవనం కొనసాగిస్తున్నారని నమ్మకం సమాజంలో కొంతమందిలో నెలకొని ఉందనే విషయం ప్రస్తావనార్హం )  తెలుగు సంవత్సర ప్రకారం శ్రీ జయనామ సంవత్సరం ( 2015 ) స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ 62వ పుట్టినరోజును  జరుపుకోవడం ప్రస్తావనార్హం.


కెసిఆర్ జాతక చక్రం !!
ప్రముఖ జ్యోతిష పండితులు ఓం సాయి జ్యోతిష్యాలయం వ్యవస్థాపకులు గొల్లపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి,వారి పంచాంగం పరిజ్ఞానం మేరకు…
ధన స్థానంలో గురువు,మూడవ ఇంట కేతు, నాలుగవ స్థానంలో చంద్రుడు, 7వ స్థానంలో శని, 8వ స్థానంలో కుజుడు, 9వ స్థానంలో రాహు, 11వ స్థానంలో సూర్య, శుక్ర బుధ, గ్రహాలు ఉన్నాయి.


జనాకర్షణ, రాజయోగం !!
కెసిఆర్ కు జనాకర్షణ రాజయోగం కు కారణం ఆయన జాతక కుండలి లో ఈ గ్రహాలు ప్రధానంగా పండితులు వివరిస్తూ ఉంటారు, శని,ఉచ్చ స్థితిలో ఉండి స్థాన బలం తో ఉండటం శని ,శుక్ర గ్రహణ మధ్య పరివర్తన యోగం ఉండటం వలన కేసీఆర్ కు మరో బలం  ఎనలేని జనాకర్షణ, విపరీత రాజయోగం, ఇస్తున్న కుజ, దశ నుంచి కెసిఆర్ జీవితం ప్రధాన మలుపు తిరిగిన ప్పటికీ  2006 లో ప్రారంభమైన రాహుదశ, ఆయనకు కలిసి వచ్చిందని, అయితే 2009, మే మాసం నుంచి కేసీఆర్ కు  రాహు, మహాదశ లో గురుభక్తి ,ప్రారంభం కావడంతో, 2009 నవంబర్ ,డిసెంబర్, మాసంలో కెసిఆర్ గురించి జాతీయ, అంతర్జాతీయ, స్థాయిలో చర్చ జరగడం ప్రస్తావనార్హం. 2011 అక్టోబర్ మాసం నుంచి రాహు, శని, భుకితి  రాష్ట్ర సాధన చివరి ఘట్టం, ఈ సమయంలో ఆరంభమైన విషయం విదితమే.  శని ,అంతర్దశ 2014 ఆగస్టు మాసం వరకు ఉంది, ఈ దశలో తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ కు అతి ముఖ్యమైన అత్యంత అనుకూల దశ. ఈ దశలో సొంత రాష్ట్రం సిద్దించడం తో పాటు కీర్తి కలకాలం నిలిచేలా చేసే దశ తో పాటు అధికార , రాజయోగం కల్పించిన విషయం  గమనార్హం.


మాటలతో సమస్యలు !!
వాక్కు, కారకుడైన బుధుడు, లాభ స్థానం లో ఉన్నా. నీచరాశి కి దగ్గరగా ఉండటం, మేష లగ్నానికి కానీ, కర్కట రాశి కి గాని, బుధుడు అనుకూలుడు కాకపోవటం వలన, కొన్ని సందర్భాలలో కెసిఆర్ తన మాటలతో ,సమస్యలను కొని తెచ్చుకొని ఎదుర్కోవడం తప్పదు. బుధుడు మీడియాకు,కూడా కారకుడు అవ్వడం ,మూలాన మీడియా నుంచి సరైన సహకారం కేసీఆర్ కు ఉండదు అనేది జ్యోతిష్యం విశ్లేషణ..