ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామి రథోత్సవం బుధవారం వైభవంగా జరిగింది. శ్రీ యోగ , శ్రీ వెంకటేశ్వర. శ్రీ రామలింగేశ్వర స్వాములు, రథములు పురవీధుల గుండా భక్తజనం గోవింద, హర హర మహాదేవ, నామస్మరణలతో ఊరేగించారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత, స్థానిక, మున్సిపల్ చైర్ పర్సన్ సంగి సత్యమ్మ, కౌన్సిలర్లు, కమిషనర్ రమేష్, బుగ్గారం జడ్పిటిసి సభ్యులు బాదినేని రాజేందర్, తదితర ప్రముఖులు స్వామివారినీ దర్శించుకున్నారు.

ఊరేగింపు ముందు ఆలయంలో స్వామి వార్లకు ప్రత్యేక పూజలు, హోమాది కార్యక్రమాలు అర్చకులు, వేద పండితులు నిర్వహించారు. స్వామి వారి రథలు ముందు బూడిద గుమ్మడికాయతో దిష్టి తీశారు.స్వామివార్ల రథములు ఇసుక స్తంభం, నంది విగ్రహం వరకు భక్తజన హర్ష ధ్వానాల మధ్య కన్నుల పండువగా జరిగింది. మంగళ హారతులు పట్టుకుని భక్తజన పురవీధుల గుండా స్వామివారి కోసం వేచి ఉన్నారు.

బుక్క గులాలు ( సుగంధ ద్రవ్యాలు ) స్వామి వారు పై చల్లుతూ టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఏ లాంటి అపశృతులు జరగకుండా పోలీసులు భక్తజనంను జరుపుతూ. రథాల ముందు పరుగులు తీశారు. అనంతరం ఆలయం వద్దకు చేరుకున్న స్వామి వారలు, ఊరేగింపుగా గోదావరి నదికి వెళ్లి చక్ర తీర్థం లో స్నానాలు ఆచరించి. ఊరేగింపుగా మధ్వాచార్య వంశీయుల ఇంటి కి చేరుకోవడంతో వారు స్వామివారికి, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులకు, వేదపండితులకు, భోజనాలు ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు రామయ్య, ఇతరులు, ఈవో శ్రీనివాస్, సిబ్బంది అర్చకులు వేద పండితులు, పోలీసులు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టడంతో రథోత్సవం ప్రశాంతంగా ముగిసింది. ఈనెల 14న ప్రారంభమైన స్వామివారి జాతర ఉత్సవాలు నేటి రథోత్సవతో ప్రధానోత్సవల ప్రత్యేక కార్యక్రమాలు ముగిశాయి.మరో మూడు రోజుల పాటు స్వామివారి పుష్పయాగం, ఏకాంతసేవ తదితర కార్యక్రమాలు జరగనున్నాయి, పదకొండు రోజులపాటు సాంస్కృతిక కార్యక్రమాలు, పౌరాణిక నాటకాలు, త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు, భరతనాట్యం,కూచిపూడి, ప్రదర్శనలు సంగీత కచేరి, హరికథ, ఒగ్గు కథలు తదితర కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణం. భక్తజనంతో కిటకిటలాడింది.

ఆలయంలో క్షేత్రంలో వీధులలో రంగురంగుల దీపాలతో అలంకరించడంతో క్షేత్రం శోభాయమానంగా విరాజిల్లింది. జగిత్యాల ఆర్టిసి డిపో నుంచి నిత్యం కొనసాగే 174 చెట్లకు అదనంగా మరో 30 అదనపు బస్సులతో ధర్మపురి ,జగిత్యాల నుంచి రాకపోకలు నిర్వహించారు డి ఎం భవభూతి. ధర్మపురిలో మకాం వేసి పర్యవేక్షించారు. టికెట్లు, ప్రసాదాల అమ్మకాలు అన్నదానం, విరాళాలు ద్వారా ఆలయానికి 11 రోజుల్లో దాదాపు రూపాయలు 47 లక్షల 16 వేల 388 రూపాయల ఆదాయం సమకూరింది. హుండీ లెక్కించాల్సి ఉంది.