“ధర్మపురి క్షేత్రంలో 5 రోజులపాటు ఉగాది ఉత్సవాల”
ధర్మపురి కాలేజ్ గ్రౌండ్ లో మార్చి 29 నుంచి ఏప్రిల్ 2 వరకు నిర్వహించనున్న ప్రతిభా పురస్కార కార్యక్రమంలో బుధవారం రాత్రి, మంత్రి ఈశ్వర్, కలెక్టర్, ఎస్పీలతో కలిసి పాల్గొన్నారు. కవులు, కళాకారులు, వృత్తి కళాకారులు, సాహితీ వేత్తలు, క్రీడాకారులు, మంచి ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ సంబంధిత సంఘసంస్కర్తలు, ఉత్తమ రైతులను, గుర్తించి ఉగాది సందర్భంగా మంత్రి పురస్కారాలు అందజేస్తారు.


విద్యార్థులు కళాకారులచే నిర్వహించిన నృత్య సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. విద్యార్థులు, కళాకారుల ప్రదర్శన నిర్వహించడం జరిగింది

కరోనా సమయంలో పేదల సంరక్షణ కోసం పకడ్బందీ చర్యలు తీసుకుంటూ, ఇంటికి తిరిగి పలుమార్లు జ్వర సర్వే నిర్వహించి, 2 డోసుల వ్యాక్సినేషన్ పూర్తిస్థాయిలో అందించడంలో ప్రతిభ కనబరిచిన అంగన్వాడీలు, ఆయాలు, టీచర్లు, ఏఎన్ఎంలు, ఐకెపి సిబ్బంది మొదలైన 500 మందికి సర్టిఫికెట్లు, మెమొంటోలు అందించిన మంత్రి సన్మానించారు.


ఈ సందర్భంగా వారు సమాజానికి అందించిన సేవలను మంత్రి కొనియాడారు. ప్రజలందరికీ మంత్రి , కలెక్టర్ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.

జిల్లా కలెక్టర్ జి రవి, ఎస్పీ సింధూ శర్మ, ఎల్.ఎం.కొప్పుల ట్రస్ట్ చైర్ పెర్సన్ శ్రీమతి కొప్పుల స్నేహాలత, స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ సంగీ సత్యమ్మ, కౌన్సిలర్లు, అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు,సిబ్బంది, విద్యార్థులు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు