116 కేసులలో రాజీ !

పుణ్యక్షేత్రమైన ధర్మపురి  జూనియర్ సివిల్ కోర్ట్ లో,  జడ్జి డాక్టర్ ప్రమీల జైన్, ఆధ్వర్యంలో శనివారం  జాతీయ లోక్ అదాలత్ జరిగింది.  అదాలత్ కమిటీ సభ్యులుగా. సీనియర్ న్యాయవాదులు,, గడ్డం సత్య నారాయణ రెడ్డి, తిర్మన్ దాస్ సత్యనారాయణ, వ్యవహరించారు.  ఈ అదాలత్ లో 116 కేసులలో. రాజి చేశారు. తదనంతరం . జడ్జి డాక్టర్ ప్రమీల జైన్ మీడియా  మాట్లాడుతూ…. కక్షిదారులు రాజీ మార్గంలో వెళ్లి తమకున్న సమస్యలను, సాధ్యమైనంత వరకు పరిష్కరించుకోవాలని, రాగద్వేషాలకు అతీతంగా, పరస్పరంగా ఇరువర్గాలు సామరస్యంగా చర్చించుకొని సాధ్యమైనంత మేరకు కోర్టులో ఉన్న కేసులను  రాజీ కుదుర్చుకుని మీతో పాటు మీ కుటుంబాల్లో ప్రశాంత   వాతావరణం కల్పించడానికి  కృషి చేయాలని  ఆమె కక్షిదారులకు హితవు చెప్పారు.  కక్షిదారుల సాధకబాధకాలను ,మానవీయ కోణంలో  ఆలోచించి ఇరువర్గాల సమక్షంలోనే జడ్జి  దాదాపు 116 కీ పైగా కేసులను రాజీ మార్గంలో పరిష్కరించారు.  లోక్ అదాలత్ లో న్యాయవాదులు, కార్తిక్, రాజేష్, గంగారెడ్డి, పవన్, వినోద్, బి. రమేష్, ఇంద్రకరణ్, జె. రమేష్, జితేందర్ రెడ్డి, రాజేష్, తదితరులు పాలుగోన్నారు.