ఏపీలో లో ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు!!

ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలను ఆంధ్ర ప్రదేశ్ లోని. అరకు వెలి. పద్మాపురం లో ఆదివారం జరిగాయి. జగిత్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్గూరి దామోదరరావు, డైరెక్టర్లు, టిఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. మార్కెట్ కమిటీల. పనితీరు, మార్కెటింగ్ స్టడీ టూర్ లో భాగంగా వీరు గత కొన్ని రోజులుగా ఏపీలో పర్యటిస్తున్నారు. సీఎం కేసీఆర్ ఆర్ కొత్తూరు నిజాంబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పుట్టినరోజు సందర్భంగా ఏపీ లో ఉన్న వీరు. జన్మదిన వేడుకలను నిర్వహించారు
ఈ సందర్భంగా చైర్మన్ దామోదర్ రావు మాట్లాడుతూ సలహాలు సూచనలు ఇచ్చేయడం కాదు నమ్మకున్న ప్రజల కోసం, నిత్యం ప్రజాసేవకై ఆలోచించే నాయకురాలు అని అన్నారు. సేవా కార్యక్రమంలో ముందు ఉంటూ రాజకీయంగా, సామజిక సేవకూరాలిగా సేవలు అందిస్తూ. ప్రజా సేవలోసంపూర్ణ ఆరోగ్యం గా ఉండాలని ఆయురారోగ్యాలతో, ఎమ్మెల్సీ కవిత చిరకాలం ప్రజాసేవలో కొనసాగాలని దామోదర రావు ఈ సందర్భంగా అన్నారు. దామోదర్ రావు ,తో పాటు జగిత్యాల ప్యాక్ చైర్మన్ పత్తిరెడ్డి మహిపాల్ రెడ్డి , AMC జగిత్యాల డైరెక్టర్లు రవి, నరేష్, మోహన్ రెడ్డి, రాజిరెడ్డి , ప్రవిన్, మల్లయ్య లు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.