ధర్మపురి ఆలయ పాలకవర్గం ఏర్పాటు!!

రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి, ఆలయ పాలకవర్గం నియమిస్తూ ప్రభుత్వం జిఓ సంఖ్య 117,  శుక్రవారం (తేదీ 11-3-2022) న ప్రభుత్వ కార్యదర్శి , సీనియర్ ఐఏఎస్ అధికారి,వి అనిల్ కుమార్ జి. ఓ, జారీ చేశారు. ఈనెల 14 నుంచి స్వామివారి జాతర ఉత్సవాలు 13 రోజులపాటు ఘనంగా జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆరు నెలల కాలపరిమితితో   ‘RenovationCommittee”  ( అభివృద్ధి కమిటీ ) కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు జీవో లో పేర్కొన్నారు.


మంత్రి సిఫారసుతో..
మంత్రి కొప్పుల ఈశ్వర్ ఈ నెల 4న దేవాదాయ శాఖ మంత్రికి  ధర్మపురి ఆలయం పాలకవర్గం ఏర్పాటు కోసం లేక సంఖ్య 37/m(welfare) 2021. ద్వారా సిఫారస్ చేయగా, దేవాదాయ శాఖ మంత్రి ఈనెల 7న ఆ శాఖ  కమిషనర్ ను  ఫైల్  సర్కులేట్ చేయాల్సిందిగా  ఆదేశించారు.  2019  ఆగస్టు మాసంలో ఆలయ పాలకవర్గం కాలపరిమితి ముగిసిన నాటి నుంచి నేటి వరకు కమిటీ ఏర్పాటు కాలేదు. 2020 సెప్టెంబర్ 9న, G.O 227. ద్వారా ఆలయ పాలక వర్గం ఏర్పాటుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన కమిటీ నియామకం నేటి వరకు జరగలేదు. .ఈ కమిటీలో  పాలకవర్గ  అధ్యక్షుడిగా ఇందారపు రామయ్య బాధ్యతలు చేపట్టనున్నారు. 

సభ్యులుగా అక్కన్న పెళ్లి సురేందర్, చుక్క రవి, స్తంభం కాడి మహేష్ (DJ), ఇనుగంటి రమాదేవి, గందె పద్మ,  వీర వేణి కొమురయ్య,  గుని శెట్టి  రవీందర్ , పల్లెర్ల సురేందర్, గుంపుల రమేష్, వేముల నరేష్,, జైన రాజమౌళి,. సంగం సురేష్ ల ను నియమిస్తూ జీవోలు పేర్కొనబడింది.
నాడు -. నేడు !
గతంలో వేముల శంకర్, ఆలయ ధర్మకర్త గా కొనసాగారు. ప్రస్తుత కమిటీలు శంకర్ తనయుడు, వేముల నరేష్ కు అవకాశం దక్కింది. గత పాలకవర్గంలో ఎనుగంటి వెంకటేశ్వరరావు ధర్మకర్త గా కొనసాగారు. ఈ కమిటీ లో ఆయన ధర్మపత్ని రమాదేవికి అవకాశం లభించినది. గతంలో గుని శెట్టి రవీందర్,  ధర్మకర్త గా కొనసాగారు, ప్రస్తుతం మళ్లీ అవకాశం దక్కింది. పాలకవర్గం ఏర్పాటు పట్ల భక్తజనం హర్షం వ్యక్తం చేస్తున్నారు.