శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో కి దర్శనాలు ప్రారంభం!!

J.Surender Kumar
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్మితమైన శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం లో భక్తుల సాధారణ దర్శనాల కోసం గురువారం నుంచి ప్రారంభమయ్యాయి

. విశాఖ రుషికొండలో సముద్రానికి అభిముఖంగా కొండపై  నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం లో ఈ నెల 18న అంకురార్పణతో ప్రారంభించి, ఐదు రోజులు పాటు వేద పండితులు, యజ్ఞయాగాదులు నిర్వహించారు. బుధవారం సాయంత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం పూజా కార్యక్రమాలతో  తదితర కార్యక్రమాలు ముగిసిన విషయం తెలిసిందే.

ఉపాధి కూలీలతో మాట్లాడుతున్న జువ్వాడి


కాంగ్రెస్ ప్రభుత్వం రానున్నది!!. జువ్వాడి
ధర్మపురి మండలం తిమ్మాపూర్ గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో కాంగ్రెస్ నాయకుడు, ధర్మపురి ఆలయ పాలకవర్గ మాజీ అధ్యక్షుడు జువ్వాడి కృష్ణ రావు  మాట్లాడుతూ రాష్ట్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. గత కొద్ది రోజులుగా మాకు చేసిన పనికి డబ్బులు ఇవ్వడం లేదని కూలీలు బాధను వెలబోశారు. ఇతర ప్రాంతాల కు వెళ్లి పనులు చేసే కన్న ఉన్న ఊరిలో పనిచేసుకొని పొట్ట నిపుంకుందాం అని పని చేస్తే ఇక్కడ కూడా సరిగ్గా డబ్బులు ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తెలియజేశారు..  గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు ఉపాధి హామీ పని పథకం తెచ్చింది అని అప్పడు కాంగ్రెస్ హయాంలో ఉపాధి హామీ కూలీలకు డబ్బులు సరిగ్గా  చెల్లింపులు జరిగాయ అన్నారు . తెరాస పాలనలో ఎవరు సంతోషంగా లేరు  అన్నారు.  కాంగ్రెస్  ప్రభుత్వం ఏర్పటు అయితే పేద ప్రజలకు మంచి జరుగుతుందన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు గురించి తెలియజేస్తూ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి రెండు లక్షల రూపాయల ప్రమాద భీమా వర్తిస్తుంది అని తెలియజేసి  నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు.  ధర్మపురి మండలం తిమ్మాపూర్ నుండి మద్దూనూర్ వెళ్లే రోడ్డు మార్గంలో నడి రోడ్డు మీద ఇసుక మరియు కంకర ని రోడ్డు మార్గంలో పోసి ప్రజలకు రాకపోకలకు ఇబ్బందులకు గురిచేస్తున్నారని , కనీస అవగాహన లేకుండా మెయిన్ రోడ్డు మీద పోయడం ఏమిటి అని ఆయన ప్రశ్నించారు. .తక్షణమే రోడ్డు మీద ఉన్న ఇసుక కంకర ని తీసివేయలని సంబంధిత అధికారులు కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోవాలని  జువ్వాడి కృష్ణ రావు అన్నారు…