భద్రాచలం శ్రీరామచంద్రమూర్తి ని మంత్రి కొప్పుల ఈశ్వర్ కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు
మంత్రితో పాటు . ప్రభుత్వ విప్ రేగా కాంతారావు స్వామివారిని దర్శించుకున్నారు.

మంత్రి దంపతులకు ఆలయ కార్యనిర్వహణాధికారి శివాజీ, సాంప్రదాయబద్ధంగా అర్చకులు వేద పండితులతో ఘన స్వాగతం పలికారు. మంత్రి దర్శనార్థం అర్చకులు వేదపండితులు అమ్మవారి ఉపా ఆలయంలో శాలువాతో సత్కరించి, స్వామివారి ప్రసాదాన్ని అందించి వేద ఆశీర్వచనం అందించారు.
చెక్కుల పంపిణీ !

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మంగళవారం
జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్, గ్రామంలో ముగ్గురు లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు, మరియు ఇద్దరి లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ 58 వేల విలువగల చెక్కులను, ఇంటింటికి వెళ్లి అందించారు. ,అనంతరం 25 లక్షల రూపాయల విలువ గల సి సి రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. జెడ్పి చైర్ పర్సన్ శ్రీమతి దావ వసంత సురేష్ గారు. ఈ ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజేంద్రప్రసాద్ ,సర్పంచ్ సరోజన మల్ రెడ్డి ఎంపిటిసి మహేష్, ఉపసర్పంచ్ కాంతమ్మ AMC డైరెక్టర్ రవి మాజీ ఎంపిటిసిలు రాజ నరసయ్య, తదితర నాయకులు పాల్గొన్నారు.
కళ్యాణ మహోత్సవం !

జగిత్యాల రూరల్ మండలం తక్కలపెల్లి గ్రామంలో బీరప్ప కామరతి దేవీ కల్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పాల్గొని పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి దావ వసంత సురేష్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్, ,ఎంపీపీ రాజేంద్రప్రసాద్, సర్పంచ్ జైపాల్ రెడ్డి, కురుమ సంఘం సోదరులు టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఎల్లమ్మ పట్నాలు !

రాయికల్ పట్టణంలో శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి పట్నాలు మరియు, బోనాల జాతర మహోత్సవానికి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగాఎమ్మేల్యే మాట్లాడుతూ, ఎల్లమ్మ దయవల్ల అందరూ ఆయురారోగ్యాలతో సుఖ శాంతులతో ఉండాలని, మంచి వర్షాలను కురు వాలని ,కరోనా వంటి అంటూ రోగాలు రావద్దని అన్నారు. రాయికల్ ను గ్రామపంచాయతీ నుండి మున్సిపల్ గా మార్చామని , పట్టణంలో రోడ్లు, దివైడర్లు,పారిశుధ్య కోసం నూతన వాహనాలు కొనుగోలు చేశామన్నారు. పెద్ద చెరువు మినీ టాంక్ బాండ్ గా మార్చుతూన్నామని, వేసవి కాలం లో సైతం చెరువు నిండు కుండలా తలపిస్తోందని, సీసీ కెమెరాలు అమర్చామని,.ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని , అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మెన్ మోర హన్మండ్లు, ఎంపీపీ సంధ్యారాణి సురేందర్ నాయక్, AMC ఛైర్మెన్ గన్నే రాజీ రెడ్డి,.PACS ఛైర్మెన్ ఏనుగు మల్లారెడ్డి, కౌన్సిలర్ లు మహేష్ గౌడ్, శ్రీదర్ రెడ్డి, మహేందర్, సాయి, కాంతారావు, యూత్ అధ్యక్షుడు మోర రామ్మూర్తి, మండలపార్టీ ఉపాధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, మాజీ AMC ఛైర్మెన్ ఉదయ శ్రీ లింగం గౌడ్, ,నాయకులు ఎలిగేటి అనిల్, ఇతరులు పాల్గొన్నారు.
రంజాన్ కానుకలను పంపిణీ
రాయికల్ పట్టణ షాది ఖానా లో రంజాన్ పండుగ పర్వదినం సందర్భంగా ప్రభుత్వ రంజాన్ కానుకలను ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ముస్లిం లకు, అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మెన్ మోర హనుమండ్లు, పాక్స్ ఛైర్మెన్ ఏనుగు మల్లారెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షులు ఇంతియాజ్, ఎమ్మార్వో దిలీప్, ఇంఛార్జి కమిషనర్ సంతోష్,కౌన్సిలర్ లు,కో ఆప్షన్ సభ్యులు, నాయకులు,ముస్లిం మైనార్టీనాయకులు,అధికారులు, తదితరులు, పాల్గొన్నారు.

పరామర్శ !

రాయికల్ మాజీ సర్పంచ్ ఎద్ధండి భుమారేడ్డి గారి తల్లి అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించి ఓదార్చారు. టిఆర్ఎస్ నాయకులు, శ్రేణులు ప్రజాప్రతినిధులు , తదితరులు ఉన్నారు.