” దేశ్ కి నేత కేసీఆర్ ఆప్ ఆగే బడో ‘ అంటూ రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు తన స్వాగత ప్రసంగంలో ముగింపు సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

టిఆర్ఎస్ 21వ ప్లీనరీ సమావేశం బుధవారం హైదరాబాదులోని హెచ్ ఐ సి సి లో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. తన అరవై ఏళ్ల రాజకీయ చరిత్రలో రాష్ట్ర, దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పథకాలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్న కెసిఆర్ లాంటి నాయకున్ని తాను ఇంతవరకు చూడలేదన్నారు.

కెసిఆర్ విజన్ నాయకుడు అంటూ కేశవరావు తన ప్రసంగంలో కేసీఆర్ ను ప్రశంసల వర్షం కురిపించారు

. 13 తీర్మానాలు ఆమోదించారు. కెసిఆర్ ప్రసంగం లో ప్రధానంగా జాతీయ సమస్యలు, విద్యుత్తు, సాగు, తాగునీటి అంశాలు శాంతిభద్రతలు, కాశ్మీర్ సమస్యలు, గవర్నర్ వ్యవస్థ, రాష్ట్రాలపై కేంద్రం చిన్న చూపు, ఇతర అంశాలపై కేసిఆర్ పరోక్షంగా కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీ విధానాలను తూర్పారబట్టారు.

సాయంత్రం ఐదు గంటల వరకు ఈ ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి.
