ధాన్యం కొనుగోలు చేయకపోతే బరిగీసి పోరాడుతాం-మంత్రి ఈశ్వర్

J.Surender Kumar,


కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో పండించిన వరిధాన్యం కొనుగోలు చేసే వరకు బరిగీసి కొట్లాడుతామని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నారు. గురువారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ చౌక్‌ వద్ద తెరాస పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు దీక్షకు మంత్రి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రైతులను చిన్నచూపు చూస్తుందన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ పాలనలో రైతులు సుభిక్షంగా ఉన్నారని, ఉచిత కరెంటు, రైతుబంధు, రైతుబీమా, కాలేశ్వరం ప్రాజెక్టుతో రైతులకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటున్నామన్నారు.

ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో రైతు సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. కేంద్రంలోని మోడీ సర్కారు రైతులను ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తుందన్నారు.
రైతుల ధాన్యం కొనేంత వరకు కేంద్రంపై పోరాటం సాగిస్తామని స్పష్టం చేశారు. ఈనెల 11న ఢిల్లీలో పెద్ద ఎత్తున రైతుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం నిరసన దీక్ష చేపట్టనున్నట్లు- తెలిపారు.

8న అన్ని గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఇండ్లపై నల్ల జెండాలు ఎగర వేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యేలు విద్యాసాగర్ రావు, సంజయ్ కుమార్, సుంకె రవిశంకర్ జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత, మున్సిపల్ ఛైర్ పర్సన్ భోగ శ్రావణి ,డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ చంద్రశేఖర్ గౌడ్, మాజీ మార్కుఫెడ్ ఛైర్మెన్ లోక బాపురెడ్డి,  రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు ప్రజాప్రతినిధులు, రైతు అనుబంధ సంఘాల సభ్యులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


పరామర్శ!
ధర్మపురి మండలం తుమ్మినాలా గ్రామంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గురువారం పరామర్శించి ఓదార్చారు.  గత నెల ఆక్సిడెంట్ లో మరణించిన ఆకుబత్తిని కొమురయ్య, కుటుంబాన్ని మరియు చెరువులో పడి మరణించిన మారంపెల్లి శరత్, పబ్బతి నవదీప్, కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో మండల పట్టణ అధ్యక్షులు సంగేపు గంగారాం, బేజ్జరపు లవణ్ ,రాష్ట్ర దళిత మొర్చ కార్యదర్శి ఒరగంటి చంద్రశేఖర్,జిల్లా ఉపాధ్యక్షులు గాజుల మల్లేశం,జిల్లా కార్యదర్శి పిల్లి శ్రీనివాస్, ఎంపీటీసీ  అకుబత్తిని తిరుపతి. ఉపసర్పంచ్ అప్పల మల్లేష్, గాజు భాస్కర్,  నలమాసు వైకుంఠం, కస్తూరి మురళీ, తదితరులు పాల్గొన్నారు.


జగిత్యాల వైద్యులకు పురస్కారం!
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా  రాష్ట్ర స్థాయిలో ప్రసవాలు అధికంగా చేసిన జగిత్యాల జిల్లా ఆసుపత్రి  స్రీల వైద్యనిపుణులు డాక్టర్. వోడ్నాల రజిత, ఆసుపత్రి సూపింటెండెంట్ సుదక్షినా దేవి, డా. రామకృష్ణ లకు వైద్య సేవా పురస్కారాన్ని రాష్ట్ర వైద్య శాఖమంత్రి  టి. హరీష్ రావు గురువారం హైదరాబాదులో ప్రధానం చేశారు. .

ఈ పురస్కారం రావడం పట్ల జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు లభించింది అన్ని వైద్య సిబ్బంది, ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.


విద్యుత్ చార్జీలు తగ్గించాలి.!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెంచిన కరెంట్ ఛార్జీలు తగ్గించాలని  గురువారం హైదరాబాదు విద్యుత్ సౌదా కార్యాలయం ముందు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు,  బట్టి, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ నాయకులు, భారీ సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు, నిరసన కార్యక్రమం చేపట్టారు. 

ర్యాలీగా వెళ్లి విద్యుత్ సౌధ, సివిల్ సప్లై భవన్ కార్యాలయం ముట్టడించి

ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకరరావును కలిసి..
పెరిగిన ధరల వల్ల సామాన్యుని పైన పడే భారం గురించి చెప్పి వెంటనే పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు.