J. Surender Kumar,
తెరాస ప్లీనరీ సందర్భంగా. ప్రత్యేక కథనం!
చాలా కొద్దిమందికే తెలుసు మలి విడుత తెలంగాణ ఉద్యమానికి నాంది చంద్రబాబు ప్రభుత్వం. రైతుల పవర్ చార్జీలు పెంచిన నాటి నుంచే ఉద్యమ ప్రస్థానం ప్రారంభమైందని, 2016 మార్చి 10న హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన ఓ సమావేశంలో సీఎం కేసీఆర్ మనసు విప్పి తెలంగాణ మలివిడత ఉద్యమ ప్రస్థానం కు గల అంశాలు, పరిస్థితులు, తాను తనతో పాటు తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, నాటి సీఎం ఎన్టీ రామారావు ను కలవడం, తెలంగాణ ప్రాంత పరిస్థితిని వివరించడం, ఎన్టీఆర్ స్లాబ్ నిర్ణయించడం, చంద్రబాబు ప్రభుత్వం రైతుల సాబ్ పెంచుతూ ఆదేశాలు ఇవ్వడం, నాటి బాబు క్యాబినెట్ సమావేశంలో వ్యతిరేకించడం, తదితర అంశాల తీరుతెన్నులను సీఎం కేసీఆర్ వివరించారు.

ఈ సభా దేవులపల్లి అమర్ రచించిన ‘డేట్ లైన్ హైదరాబాద్ ‘ పుస్తకావిష్కరణ సభ , కెసిఆరే ఆవిష్కర్త సభ వేదికపై పాత్రికేయ దిగ్గజాలు, పొత్తూరి వెంకటేశ్వరరావు, కె.రామచంద్రమూర్తి, శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఐఏఎస్ అధికారి, ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి, నాటి IJU సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్, అప్పటి నగర మేయర్ బొంతు రామ్మోహన్ ,వేలాది మంది జర్నలిస్టు సమక్షంలో సీఎం కేసీఆర్ తెలంగాణ ఉద్యమ ప్రస్థానం ఆరంభం తీరుతెన్నులను వివరించారు.
ఆయన మాటల్లోనే,

1985 సంవత్సరంలో మెదక్ జిల్లా సిద్దిపేట నియోజకవర్గంలో రైతులు కరెంట్ స్తంభాలకు, విద్యుత్ తీగలు, ట్రాన్స్ఫార్మర్లు, కరెంటు మోటార్లు, కనెక్షన్ల కోసం వేలాది రూపాయలు విద్యుత్ అధికారులకు చెల్లించేవారు. ఒక్క సిద్దిపేట నియోజకవర్గం నుంచి దాదాపు 50 లక్షల రూపాయలు రైతులు విద్యుత్ అధికారులకు చెల్లించిన సమాచారం నాకు తెలిసింది అన్నారు. ఈ విషయం అధికారులను నిలదీయగా సార్ ప్రభుత్వం వాటిని సమకూర్చడం లేదు అంటూ విద్యుత్ చార్జీల భారం తదితర అంశాలు వివక్షత నాకు వారు వివరించారు అని కెసిఆర్ స్పష్టం చేశారు. కొంతమంది ఉత్తర తెలంగాణ జిల్లాల ఎమ్మెల్యేలతో కలిసి నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కలిసి పరిస్థితిని వివరించి, సార్ మా ప్రాంతంలో నీటి ప్రాజెక్టులు లేవు, రైతాంగానికి భూగర్భజలాలు దిక్కు, అంటూ రైతులపై, విద్యుత్ భారం గణాంకాలతో వివరించినట్టు కెసిఆర్ తెలిపారు.

సీఎం ఎన్టీ రామారావు విద్యుత్ బోర్డు చైర్మన్ తాతారావు ను పిలిపించి పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నించారని కెసిఆర్ వివరించారు. ‘ సార్ విద్యుత్తు పరికరాలు ఉచితంగా అందించడం చార్జీలు తగ్గించడం వీలు కాదంటూ చైర్మన్ తాతారావు ఎన్టీరామారావు కు స్పష్టం చేశారు. ఈ దశలో ఎన్టీ రామారావు ప్రిన్సిపల్ కార్యదర్శి రాఘవేంద్ర రావును ఏమిటి పరిస్థితి? అని అడిగారు. ఆయన సార్ ఎమ్మెల్యేలు వివరిస్తున్నది వాస్తవం సార్ అంటూ వివిధ అంశాలను వివరించారని కేసీఆర్ తెలిపారు. వెంటనే ఎన్టీఆర్ రేపు అసెంబ్లీలో రైతుల విద్యుత్ చార్జీలపై స్లాబ్ ప్రకటన చేస్తానంటూ, బోర్డు చైర్మన్ తాతారావు ను ‘ ‘ ‘నమస్కారం మీరు వెళ్ళండి’ అన్నారని కేసీఆర్ వివరించారు.

మరుసటి రోజున ఎన్టీరామారావు అసెంబ్లీకి వస్తున్న తరుణంలో నేను మరి కొంత మంది ఎమ్మెల్యేలు ఆయన ప్రవేశించే ద్వారం వద్ద, పూల బోకే లతో నిల్చున్నాము. కారు దిగగానే ఆయనకు అందించాము. ఎన్టీరామారావు ఏమిటిది అనగానే సార్ ఈరోజు మీరు అసెంబ్లీలో రైతుల విద్యుత్ పై ప్రకటన చేస్తాను అన్నారు సార్ అని గుర్తు చేయగా, ” ఓకే బ్రదర్ ” చేస్తాను అన్నారు అంటూ జరిగిన ఉదంతము కేసీఆర్ వివరించారు.
చంద్రబాబు ప్రభుత్వం లో క్యాబినెట్ సమావేశంలో రైతుల విద్యుత్ స్లాబ్ రేట్ పెంచుతూ అంశంలో చేర్చారు. నేను నేను నాతో పాటు కొందరు మంత్రులు గట్టిగా ఈ అంశంను గంటపాటు వ్యతిరేకించాము, ఓ దశలో నేను ఛార్జీలు పెంచితే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ భూస్థాపితం చేస్తారని, బాబుకు చెప్పినట్లు కేసీఆర్ తెలిపారు. ఈ దశలో ఈ అంశం క్యాబినెట్ సమావేశంలో వాయిదా వేశారు అంటూ వివరించారు.

కొన్ని రోజుల తరువాత నా క్వార్టర్లు నా నియోజకవర్గ,కార్యకర్తలు, ఉండగా ‘తేజ న్యూస్ ఛానల్’ లో రైతుల విద్యుత్ స్లాబ్ రేట్ బాబు పెంచినట్లు వార్తలు వస్తున్నాయి. ఇది నిజమా? కాదా ? అని కొంతమంది పాత్రికేయ మిత్రులు అడిగాను, వారు నిజమే సార్ అని అన్నారు. వెంటనే పెన్నుతో, తెల్లకాగితంపై నా పదవికి రాజీనామా చేస్తూ లేఖ పంపినట్లు, కెసిఆర్ వివరిస్తూ ఇక్కడి నుంచి తెలంగాణ ఉద్యమ ప్రస్థానం ఆరంభం అయిందని వివరించారు.

ఇక ప్రొఫెసర్ జయశంకర్ సార్ తో కలిసి ” వై తెలంగాణ పీపుల్ వాంట్ తెలంగాణ ” అనే సిడిని తయారు చేశామన్నారు. అందులో పొత్తూరి వెంకటేశ్వరరావు వ్యాఖ్యానాలతో, ఢిల్లీలో వివిధ రాష్ట్రాల రాజకీయ పార్టీల, అధినేతలను కలవడం, వారిని భోజనాలకు పిలవడం, వారికి మా తెలంగాణ బాధలను వివరించిన సీడీలను, చూపించడం, వారికి ఇవ్వడం, పనిగా పెట్టుకున్నామన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, హైకోర్టు న్యాయమూర్తులకు, గవర్నర్లకు, యూనివర్సిటీల వైస్ ఛాన్స్లర్ లకు, జాతీయస్థాయి అవార్డు గ్రహీతలకు, నోబుల్ ప్రైజ్ అవార్డు గ్రహీతలకు, జాతీయ, అంతర్జాతీయ, పత్రికలకు, సంపాదకులకు, ఈ సిడి ల ను పంపించి చి వివరించినట్టు కేసీఆర్ తెలిపారు.

గ్రామ గ్రామాన తెలంగాణ అంశం తెలియ పరచడం కోసం వ్యవస్థను సామూహికంగా తెలంగాణ అంశంపై కదలిక ఎత్తుగడలో భాగంగా ఆరంభంలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసినట్టు కేసీఆర్ తెలిపారు. ఉద్యమం ఆరంభంలోనే వేలాది మందితో తెలంగాణ అంశం పై గంటలకొద్దీ చర్చలు జరిపామని, అనేకమంది సంపాదకులతో, ‘ సమస్య ఇది.. ఎలా పరిష్కరించాలంటూ ‘ అనేక సార్లు సంపాదకులతో మాట్లాడి వందలాది సమావేశాలు నిర్వహించినట్టు కేసీఆర్ తెలిపారు.
మలివిడత ఉద్యమ సారథి కెసిఆరే !

” కెసిఆర్ మాట్లాడిన వార్త.. మౌనంగా ఉన్నా వార్తే.. ఆ మౌనం వెనుక ఎలాంటి రాజకీయ విస్పోటనం ఉందోనని రాజకీయ ప్రత్యర్థులలో ప్రకంపనాలు కలిగించే నాయకుడు ఆయన. ప్రత్యేక రాష్ట్ర కాంక్ష ను 14 సంవత్సరాల పాటు ప్రజల్లో రగిలించిన 60 ఏళ్ల కల సాకారం చేసిన ఉద్యమము నేత అతడు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రజాక్షేత్రంలో ప్రళయకాల, రుద్రునిలా, తాండవం చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించిన అజా మర కీర్తిని పొందిన దిగ్గజం ఆయన. తెలంగాణ రాష్ట్ర, చరిత్ర పుటలలో చిరంజీవిగా, చిరస్థాయిగా, తనకంటూ ఓ ప్రత్యేక చరిత్రను లిఖించుకున్న అర్హతను పొందిన ఆదర్శనీయుడు, ఆ చరిత్రకారుడు, ఆయనే సీఎం కెసిఆర్ .
ఉద్యమంలో కొన్ని ప్రధాన ఘట్టాలు !

* 2021 ఏప్రిల్ 27న టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం. తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కేసీఆర్ రాజీనామా !
* 2001 మే 11 న కరీంనగర్లో టిఆర్ఎస్ మొదటి బహిరంగ సభ దాని పేరు” సింహగర్జన”
* 2003 మే మాసంలో అలంపూర్ నుంచి గద్వాల్ వరకు కేసీఆర్ పాదయాత్ర !
* 2003 జూలై మాసంలో ధర్మపురి నదిలో కేసీఆర్ దంపతులు పుష్కర స్నానం, పుష్కర యాగం కు లక్షలాది రూపాయల నిధుల సమీకరణ, శ్రీ మఠం స్వామీజీ యాగ నిర్వహణకు అప్పగింత!
*2006 ఆగస్టు మాసంలో తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం పట్ల యూపీఏ ప్రభుత్వం జాప్యం కు నిరసనగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కేసీఆర్ మొదటి నిరాహారదీక్ష !
*2006 -2008 సంవత్సరంలో కెసిఆర్ ఆర్ కె కేంద్రమంత్రి పదవికి రాజీనామా ( 2006లో మంత్రిపదవికి) కరీంనగర్ ఎంపీ స్థానం కు రాజీనామా తిరిగి అఖండ మెజార్టీతో గెలుపు.
* 2009 సార్వత్రిక ఎన్నికల్లో ‘మహా కూటమి’ టిడిపితో పొత్తు!
* 2009 జూన్ మాసంలో కెసిఆర్, టి ఆర్ ఎస్ అధ్యక్ష పదవికి రాజీనామా, స్వర్గీయ ప్రొఫెసర్ జయశంకర్ సార్ జోక్యంతో ఉపసంహరణ!
* 2009 నవంబర్ 29న కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆమరణ దీక్ష !
* 2009 నవంబర్ మాసంలో లో కాస్ట్ లో శ్రీకాంతచారి మంటలలో ఆత్మబలిదానం మలిదశ ఉద్యమం రగిలించిన వాడు!
* 2009 డిసెంబర్ 9న కేంద్ర మంత్రి చిదంబరం తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించినట్టు ప్రకటన !
* 2009 డిసెంబర్ 23న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ నుంచి వెనక్కి !
* 2010 ఫిబ్రవరి 9న కేంద్ర ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీ నియామకం!
*2010 డిసెంబర్ 30న శ్రీకృష్ణ కమిటీ నివేదిక కేంద్ర ప్రభుత్వానికి సమర్పణ !
* 2012 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ను కాంగ్రెస్లో విలీనం చేస్తానంటూ కేసీఆర్ ప్రకటన !
* 2013 జూలై మాసంలో కరీంనగర్లో మేధోమథన సదస్సు టీఆర్ఎస్ విలీనం ప్రతిపాదనను కేసీఆర్ ఉపసంహరించుకున్నట్లు ప్రకటన !
*2013 జులై లో పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం !
* 2013 అక్టోబర్ 3న తెలంగాణ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం !
* 2013 డిసెంబర్ 13న రాష్ట్ర అసెంబ్లీకి తెలంగాణ బిల్లును పంపిన రాష్ట్రపతి !
* 2014 జనవరి 30న అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై చర్చ ముగింపు !
* 2014 ఫిబ్రవరి 13న తెలంగాణ బిల్లు లోక్ సభలో ప్రవేశ పెట్టిన కేంద్ర ప్రభుత్వం !
* 2014 ఫిబ్రవరి 18న లోక్సభలో తెలంగాణ బిల్లు ఆమోదం !
* 2014 ఫిబ్రవరి 20న రాజ్యసభలో బిల్లు ఆమోదం !
* 2014 మార్చి 1న రాష్ట్రపతి తెలంగాణ బిల్లుకు ఆమోదం!
* 2014 మార్చి 4న గెజిట్ విడుదల !
* 2014 జూన్ 2 న అపాయింటెడ్ డే !
* 2014 జూన్ 2న తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం !

రాష్ట్ర సాధన ఉద్యమంలో ఉస్మానియా, కాకతీయ, తదితర విశ్వవిద్యాలయాలలో విద్యార్థుల ఆందోళనలు ఆత్మబలిదానాలు, రాస్తారోకోలు, వంటావార్పులు, సాగరహారం, మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె, పాత్రికేయులు, ఉద్యోగులు, మహిళలు, మహిళా సంఘాలు, కుల సంఘాలు, బడుగు బలహీన వెనుకబడిన తరగతుల ప్రజా సమూహం,నాట్యమండలి కళాకారులు, గ్రామీణ గాయకులు ,ఏకతాటిపై నిలిచి రాజీలేని పోరాటం చేస్తూ, ఓకే గొంతు కై, మా రాష్ట్రం మాకు కావాలి, అంటూ పోరాడిన సందర్భంలో తెలంగాణ రాష్ట్రం కలసికట్టుగా సాధించాము అని చెప్పక తప్పదు.