J.Surender Kumar,
మీకు అగుపిస్తుంది, మీరు చదివింది అక్షర సత్యం, తమకు తమ కుటుంబ సభ్యులకు జీవనోపాధి కల్పిస్తున్న వృత్తి పరికరికరాలకు, ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు తీర్చుకొని భక్తి ప్రవృత్తులను చాటుకున్నారు వారు, కెమెరా స్టూడియోలు నిర్వాహకులు ఫోటోగ్రాఫర్లు వీడియో గ్రాఫర్లు కెమెరాలకు వీడియో కెమెరాలకు ప్రత్యేకంగా పూజలు చేయించుకున్నారు.

వివరాలు ఇలా ఉన్నాయి
, జగిత్యాల జిల్లా ధర్మపురి మండల ఫొటోగ్రాఫేర్స్ అండ్ వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం జాతీయ కెమెరా దినోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. సంఘ సభ్యులు సామూహికంగా స్థానిక అయ్యప్పస్వామి ఆలయంలో, కేమెరా లకు ఆలయ అర్చకులు అశ్విన్ చే వేదమంత్రాలు మధ్యన ప్రత్యేక పూజలు, అష్టోత్తర శతనామార్చనలు . మంగళ హారతులు, మహానైవేద్యం, తీర్థ ప్రసాదాలు వితరణ ఇత్యాది కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.

అనంతరం స్వీట్లు పంచుకొని సంబరాలు ఘనంగా చేసుకున్నారు. .ఈ కార్యక్రమంలో ధర్మపురి మండల ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం నాయకులు,

సభ్యులు అధ్యక్షుడు కొత్తపల్లి కిషన్ ప్రధాన కార్యదర్శి వడ్లూరి రవిందర్
ఉపాధ్యక్షుడు గంధం ధర్మయ్య క్యాషియర్ భూపతి మల్లేశ్
ముఖ్య సలహాదారు ఉత్తేమ్ పెద్దన్న గౌరవ అధ్యక్షుడు ఉయ్యాల శ్రీనివాస్ జిల్లా కార్యవర్గ నాయకులు తోట రవిందర్, వంగల రవిందర్,సంఘము సభ్యులు రాజేష్, రమేష, తదితరులు పాల్గొన్నారు
