దేశ భక్తులే దేశ ద్రోహులయ్యేరా..?
అగ్నిపథ్” ను రద్దు చేయాలి.!
ధర్మపురి లో “కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష”


డీసీసీ అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్ డిమాండ్

దేశం కోసం పనిచేస్తామని ముందుకు వచ్చిన దేశ భక్తులను కేంద్ర ప్రభుత్వం దేశ ద్రోహులుగా చిత్రీకరిస్తుందని దేశ రక్షణను పణంగా పెట్టే అగ్నిపథ్‌ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని జగిత్యాల జిల్లా డి సి సి అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ డిమాండ్‌ చేశారు.
సోమవారం ధర్మపురి లో “కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష” చేపట్టారు.

ఈ సమావేశంలో టీపీసీసి కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్ ,మరియు ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. దేశ రక్షణ విషయంలో బిజెపి నకిలీ దేశభక్తి బట్టబయలు అయిందన్నారు. దేశ రక్షణను సైతం ప్రైవేటీకరణకు పూనుకోవడం సిగ్గుచేటన్నారు. కేవలం నాలుగు సంవత్సరాలు మాత్రమే ఉంచుకుని తర్వాత ఇంటికి పంపి వారికి ఎటువంటి పెన్షన్‌, ఇతర సదుపాయాలు లేకుండా చేయడం చూస్తుంటే బిజెపి ప్రభుత్వం దేశ రక్షణ పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందో అర్థం అవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్‌ పథకం పట్ల ఇప్పటికే దేశ వ్యాప్తంగా యువత నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అయినా కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని విమర్శించారు. గత 75 సంవత్సరాలలో ఆయా కేంద్ర ప్రభుత్వాలు అనుసరించిన విధానాలనే బీజేపీ అనుసరించాలని పేర్కొన్నారు.

ఆర్మీ రిక్రూట్మెంట్ పై కేంద్ర ప్రభుత్వం రాజకీయం చేస్తున్నారని విద్యార్థుల జీవితాలను నాశనం చేయొద్దని సూచించారు. దేశం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి సేవ చేద్దామని భావించిన యువకులపై విద్రోహక, దేశద్రోహ ముద్ర వేయడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ దీనిపై పునరాలోచించాలని సూచించారు. ఆర్మీ శిక్షణ ఇస్తున్న కేంద్రాల్లో రెచ్చగొట్టిన నిర్వాహకులను దీనికి బాధ్యులు చేయాలే తప్ప అభం శుభం తెలియని విద్యార్థుల జీవితాలను బలి చేయడం తగదన్నారు. నోటిఫికేషన్ విడుదల చేసి ఆ తర్వాత అగ్నిపత్ ప్రకటించి యువకులను నిర్వీర్యం చేసి పట్టించుకోకపోవడం దేశద్రోహం అన్నారు. ఉద్యోగాల కోసం యువకులు ఎంతో ఎదురు చూసి వారిలోని ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకుందని, దీనికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. గత ప్రభుత్వాలు చేపట్టిన రిక్రూట్మెంట్ విధానాలనే తిరిగి చేపట్టాలని తమ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, మరియూ టీపీసీసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నేతృత్వంలో దేశవ్యాప్తంగా దీనిపై సత్యాగ్రహం చేపడుతున్నామని చెప్పారు. అందులో భాగంగానే ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలో ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సత్యాగ్రహ దీక్ష చేపట్టినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ధర్మపురి, పెగడపల్లి, వెల్గటూర్, ధర్మారం, బుగ్గారం మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు
సంగనబట్ల దినేష్, బుర్ర రాములు గౌడ్, తాటిపర్తి శైలేందర్ రెడ్డి, ఆవుల శ్రీనివాస్ , వేముల సుభాష్, బ్లాక్ అధ్యక్షడు సుధాకర్, సర్పంచులు శోభారాణి, మురళీ గౌడ్, నాయకులు వేముల రాజేశ్, చిలుముల లక్ష్మణ్, కస్తూరి శ్రీనివాస్, బాలగౌడ్, జాజాల రమేశ్ సంది మల్లారెడ్డి, చాట్ల విజయ భాస్కర్, యూత్ కాంగ్రెస్ నాయకులు మొగిలి, అనిల్ కుమార్, పూదరి రవి, స్తంబంకాడి గణేష్ ప్రవీణ్ కుమార్ బత్తినీ చంద్ర శేఖర్ రాకేశ్, తదితరులు పాల్గొన్నారు

టిపిసిసి ఎన్నారై సెల్ గల్ఫ్ కన్వీనర్ గా నరేష్ రెడ్డి
అభినందించిన రేవంత్ రెడ్డి

జగిత్యాల జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి ని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) ఎన్నారై సెల్ గల్ఫ్ కన్వీనర్ గా నియమితులయ్యారు. కాంగ్రెస్ పార్టీ ప్రవాస భారతీయుల విభాగం చైర్మన్ డా. బి .ఎం. వినోద్ కుమార్ సోమవారం ఈమేరకు నియామక పత్రాన్ని గాంధి భవన్ లో అందజేశారు.
ఈ సందర్బంగా నరేష్ రెడ్డిని పిసిసి అధ్యక్షులు ఎ. రేవంత్ రెడ్డి గాంధీ భవన్ లోని తన చాంబర్ లో అభినందించారు. గల్ఫ్ కార్మికుల హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది… గల్ఫ్ కార్మికుల బాధలు తీరుస్తుందని అన్నారు.
నరేష్ రెడ్డి జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా, మన్నెగూడెం సర్పంచ్ గా కొనసాగుతున్నారు. గతంలో 11 ఏళ్లపాటు సౌదీ లోని అరేబియన్ అమెరికన్ పెట్రోలియం నేచురల్ గ్యాస్ కంపెనీ లో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో లెవల్-1 సర్టిఫైడ్ రిగ్గర్ గా పనిచేశారు. ‘సౌదీ అరామ్కో’ కంపెనీలో అత్యంత నైపుణ్యం కలిగిన శ్రామికశక్తి బృందంలో సభ్యుడిగా గుర్తింపు పొందారు.
ఈ సందర్బంగా నరేష్ రెడ్డి మాట్లాడుతూ.. “తెలంగాణ రాష్ట్రానికి చెందిన సుమారు 15 లక్షల మంది గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈ, ఓమన్, ఖతర్, కువైట్, బహ్రెయిన్ లతో పాటు 18 ఈసీఆర్ దేశాలకు ఉపాధి కోసం వలస వెళ్లారు. విదేశాల్లో పనిచేసే కార్మికులకు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడంలో కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ప్రవాసీ కార్మికుల హక్కుల రక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ అండగా ఉండి పోరాటం చేస్తుంది” అని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం. గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రతి ఏటా రూ. 500 కోట్ల బడ్జెట్ కేటాయించాలి. గల్ఫ్ మృతులకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలి. కేంద్ర ప్రభుత్వం… హైదరాబాద్ లో సౌదీ అరేబియా, యుఏఈ కాన్సులేట్ లు ఏర్పాటు చేసేలా ప్రయత్నించాలి. ఎన్నారైలు తమ ఓటు హక్కును ఆన్ లైన్ ద్వారా వినియోగించుకునేలా ఏర్పాట్లు చేయాలి. రూ. 10 లక్షల విలువైన ‘ప్రవాసి భారతీయ బీమా యోజన’ అనే ప్రమాద బీమాలో సహజ మరణం కూడా కవర్ అయ్యేలా చూడాలి. గల్ఫ్ దేశాల నుండి ఇండియా కు ఇటీవల పెంచిన విమాన చార్జీలను తగ్గించాలి” అని డా. బి. ఎం. వినోద్ కుమార్, సింగిరెడ్డి నరేష్ రెడ్డి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు


బిజేపి నాయకులు మదన్ మోహన్ పరామర్శలు.,
బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు తొగిటి లక్ష్మీనారాయణ తల్లి గారు మరియు బీజేపీ భూపతిపూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు సంకోజి శేఖర్ మామయ్య మరణించగా వారి కుటుంబాలను మరియు భూపతిపూర్, మైతపూర్ గ్రామాలకు చెందిన పలువురి కుటుంబాలను పరామర్శించిన బీజేపీ జిల్లా నాయకుడు చిలకమర్రి మదన్ మోహన్, వారి వెంట బీజేపీ రాయికల్ మండల అధ్యక్షుడు అన్నవేణి వేణు,ప్రధాన కార్యదర్శి తిప్పిరెడ్డి రాజశేఖర్, యువమోర్చా అధ్యక్షుడు ఎంపీటీసీ రాజనాల మధు,మండల కార్యదర్శి ఏనుగు రవీందర్,దుంపల రాజారెడ్డి,సంకోజి శేఖర్,జీకురి ఆనంద్ తదితరులు ఉన్నారు.


నోట్ బుక్స్ పంపిణి !
బుగ్గారం మండలం గంగాపూర్ ప్రభుత్వ పాఠశాలలో సోమవారం ధర్మపురి ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పల్లెర్ల సురేంద్ర విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు పుస్తకాలను అందించారు తమ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు ఆయన తెలిపారు ప్రధానోపాధ్యాయుడు శ్రావణ్ కుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


స్వామిని దర్శించుకున్న రామగుండం ఎమ్మెల్యే !
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని రామగుండం శాసనసభ్యులు కోరుకంటి ఛందర్ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు . వీరికి ముందుగా దేవస్థానం సాంప్రదాయం ప్రకారం సాదరంగ స్వాగతం పలికి పూజల చేసిన అనంతరం అర్చకులు ఆశీర్వచనం ఇవ్వగా దేవస్థానం రెనవేషన్ కమిటి సభ్యులు ఇందారపు రామన్న శేషవస్త్ర ప్రసాదం చిత్రపటం అందజేసినారు.


ఇట్టి కార్యక్రమంలో దేవస్థానం రెనవేషన్ కమిటి సభ్యులు అక్కనపల్లి సురేందర్, వేముల నరేష్ వేదపండితులు బొజ్జ రమేష్ శర్మ , ముత్యాల శర్మ , ముఖ్య అర్చకులు నంభి శ్రీనివాస్ , అభిషేకం పురోహితులు బొజ్జ సంతోష్ కుమార్, సంపత్ కుమార్ రాజగోపాల్, పాల్గొన్నారు.
.