హైదారాబాద్ లో ప్రధాని మోదీ పర్యటన షెడ్యూల్ !


2వ తేదీ శనివారం..


12 .45 నిమిషాలకు ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుండి ప్రధాని బయలుదేరి 2 .55గంలకు బేగం పేట్ ఎయిర్ పోర్ట్ చేరుకుంటారు.
3 .గంలకు బేగం పేట్ నుండి ప్రత్యేక హెలికాప్టర్ లో బయలు దేరుతారు
3.20 గంలకు HICC నోవాటేల్ కి ప్రధాని చేరుకుంటారు
3.30 నోవాటేల్ కన్వేషన్ సెంటర్ కి ప్రధాని
3.30 నుండి 4 గంటల వరకు రిజర్వడ్
సాయంత్రం 4 గంటలు నుండి రాత్రి 9 వరకు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధాని మోడీ పాల్గొంటారు.
రాత్రి 9 గంటలు నుండి రిజర్వ్

3.07.22 ఆదివారం:
ఉదయం 10 గంటలు నుండి సాయంత్రం 4. 30వరకు బీజేపీ కార్యవర్గ సమావేశంలో ప్రధాని
సాయంత్రం 4. 30 నుండి 5.40వరకు రిజర్వ్
సాయంత్రం 5.55 HICC వద్ద హెలిప్యాడ్ కి చేరుకోనున్న ప్రధాని
సాయంత్రం 6.15 నిమిషాల కు బేగం పేట్ ఎయిర్ పోర్ట్ కి మోడీ
6 .30 నిమిషాలకి రోడ్డు మార్గనా పెరేడ్ గ్రౌండ్ బహిరంగ సభకు మోడీ
6.30 నుండి రాత్రి 7.30 వరకు బహిరంగ సభలో ఉండునున్న మోడీ
రాత్రి 7.35 నుండి బహిరంగ సభ నుండి బయలుదేరానున్న మోడీ
ఆ రాత్రి కి నోవాటేల్ లేదా రాజ్ భవన్ లో బస చేయనున్న మోడీ
4 07. 22సోమవారం:

ఉదయం 9.20కు బేగం పేట్ ఎయిర్ పోర్ట్ కి మోడీ
బేగం పేట్ నుండి విజయవాడకు ప్రత్యేక విమానం లో మోడీ
10.10 నిమిషాలకు విజయవాడ చేరుకొనే అవకాశం
సమయాన్ని బట్టి పర్యటన లో మార్పులు చేర్పులు జరిగే అవకాశముందంటోన్న పోలీసులు

ప్రజా సమస్యల పరిష్కారం లో అధిక ప్రాధాన్యత ఇవ్వాలి జిల్లా కలెక్టర్ జి.రవి

జగిత్యాల,-జిల్లాలోని  ప్రజా సమస్యల పరిష్కారం లో అధిక ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ జి.రవి సంబంధించిన అధికారులను ఆదేశించారు.  కల్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్, ధరణి పెండింగ్ మ్యూటేషన్, అక్రమ ఇసుక రవాణా నియంత్రణ తదితర అంశాల పై సంబంధిత అధికారులతో కలెక్టర్ గురువారం జూమ్ ద్వారా రివ్యూ నిర్వహించారు.  జిల్లాలో గత వారంలో మండలాల వారీగా సీజ్ చేసిన అక్రమ ఇసుక రవాణా వివరాలు కలెక్టర్ తహసిల్దార్ లను అడిగి తెలుసుకున్నారు.   అక్రమ ఇసుక రవాణా క్షేత్రస్థాయిలో నిలిపివేసేందుకు నిరంతరం తనిఖీలు నిర్వహించాలని, అధికారులు క్షేత్ర స్థాయిలో నిఘా పెంచాలని కలెక్టర్ సూచించారు.  జిల్లాలోని పాఠశాలలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్నా, మన ఊరు మన బడి పనులు వీటికి అవసరమైన ఇసుకను కేటాయించాలనే, దీనిపై సంపూర్ణ నివేదిక తయారు చేయాలని కలెక్టర్ ఆర్డీవోలకు ఆదేశించారు.   కల్యాణ లక్ష్మి / షాదీ ముబారక్ దరఖాస్తులు పెండింగ్ లో ఉన్న వాటిని, తాసిల్దారు సంబంధిత ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుని తోరగా క్లియర్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
అనంతరం  ధరణి దరఖాస్తులు, పెండింగ్ మ్యూటేషన్, ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారం మండలాల వారీగా వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
జిల్లాలో చేపట్టిన మన ఊరు మన బడి కార్యక్రమంలో ఎంపికైన పాఠశాలల అభివృద్ధి  నిర్మాణ పనులు జాప్యం లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ఆర్.డి.ఓ.లను  కలెక్టర్ ఆదేశించారు.  అదనపు కలెక్టర్ బి.ఎస్. లత , జగిత్యాల,కొరుట్ల, రెవెన్యూ డివిజన్ అధికార్లు, తాసిల్దారు సంబంధిత అధికారులు, సిబ్బంది, తదితరులు  వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

బస్తీ దౌఖాంలో పరిశీలన!

జగిత్యాల పట్టణం టి.ఆర్. నగర్ , ఇస్లాంపుర లోని బస్తీ  దవాఖాన లలో ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ జి.రవి. ఈ సందర్భంగా పనుల్లో వేగం పెంచి 15 రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ పర్యటన లో డి.ఎం.హెచ్.ఓ. శ్రీధర్, మున్సిపల్ కమిషనర్ స్వరూపరాని, ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


రానున్న ఎన్నికల్లో మోడీ ప్రభుత్వమే ఖాయం!
2024 లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం రావడం ఖాయమని కేంద్ర పర్యటకశాఖ సహాయ మంత్రి శ్రీపాద నాయక్ అన్నారు. గురువారం గ్రామపరి పట్టణంలో ఆయన బిజెపి కీలక నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం రావడం ఖాయమని ఎందుకోసం కృషి చేస్తున్న నాయకులు కార్యకర్తలు తగిన గుర్తింపు ఉంటుందన్నారు.  హైదరాబాద్లో జరగనున్న జాతీయ కార్యవర్గ సమావేశాల కు భారీ బహిరంగ సభ కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన. పిలుపునిచ్చారు. ధర్మపురి నియోజకవర్గ ఇన్చార్జ్  కన్నం అంజయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ,జిల్లా, స్థానిక, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు


గాంధీభవన్ లో..
హైదరాబాదులోని గాంధీభవన్ లో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు  గురువారం జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలిగా, జగిత్యాల మాజీ మున్సిపల్ చేర్ పర్సన్  తాటిపర్తి విజయలక్ష్మి కు నియామక పత్రాన్ని అందించారు.


అలాగే PCC ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నీ,  జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అడ్డూరి లక్ష్మణ్ కుమార్ కలిసి మర్యాద పూర్వకంగా కలిసి శాలువతో సత్కరించినారు.


ఎయిర్ పోర్టు లో చిక్కుకున్న యువకుడు
4 రోజులుగా అవస్థలు!


విజిట్ వీసాపై వెళ్లిన ఒక యువకుడిని బహరేన్ ఎయిర్ పోర్టులో అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు నిలిపివేశారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి తండాకు చెందిన బనావత్ చక్రవర్తి   27.06.2022 న ‘గల్ఫ్ ఏర్’ ప్లయిట్  GF-275 ద్వారా  హైదరాబాద్ నుండి బహరేన్ కు వెళ్ళాడు. ఎయిర్ పోర్టు లోని ఇమ్మిగ్రేషన్ అధికారులు అతన్ని ఎందుకు నిలిపివేశారో కారణాలు తెలియడం లేదు. 
సహాయం కోసం యువకుడి తండ్రి మోజీరాం స్థానిక నాయకుడు  పట్కూరి తిరుపతి రెడ్డిని  సంప్రదించాడు. విషయం తెలిసిన టిపిసిసి ఎన్నారై సెల్ – గల్ఫ్ కన్వీనర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డి. యువకున్ని రక్షించాలని కోరుతూ ట్విట్టర్ ద్వారా విదేశాంగ మంత్రి,  ఇండియన్ ఎంబసీ, తెలంగాణ సిఎంఓ, ఎంపీ రేవంత్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కు ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు.