పది ఫలితాల పట్ల మంత్రి ఈశ్వర్ హర్షం !


హైదరాబాద్:సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీకి చెందిన విద్యార్థులు ఇంటర్మీడియట్ లో మాదిరిగానే పదవ తరగతి ఫలితాలలో కూడా అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు. మరోసారి విజయ కేతనం ఎగురేశారు..పదవ తరగతిలో స్టేట్ సరాసరి 90%కాగా,ఈ సొసైటీకి చెందిన విద్యార్థులు 98.14%మంది ఉత్తీర్ణులయ్యారు..ఈ సొసైటీకి చెందిన 18వేల 545 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, వీరిలో 18 వేల 200మంది పాసయ్యారు..వీరిలో 287మంది నూటికి నూరు శాతం ( 10/10) మార్కులు సాధించారు. పదవ తరగతిలో ఈ సొసైటీకి చెందిన 126 స్కూళ్లు 100% ఫలితాలు సాధించాయి. ఎస్సీ గురుకుల పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించడం పట్ల మంత్రి కొప్పుల ఈశ్వర్, సొసైటీ కార్యదర్శి రోనాల్డ్ రాస్ లు సంతోషం వ్యక్తం చేశారు. .విద్యార్థులు,వారి తల్లిదండ్రులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అధికారులు, అధ్యాపకులు, సిబ్బందిని మంత్రి కొప్పుల ఈశ్వర్, కార్యదర్శి రోనాల్డ్ రాస్ లు అభినందిస్తూ, ,ఇదే విధంగా ముందుకు సాగుతూ సొసైటీ పేరు ప్రతిష్ఠలను మరింత ఇనుమడింప జేయాల్సిందిగా కోరారు.


శిక్షణ ముగింపు కార్యక్రమంకు మంత్రి!
జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణ కేంద్రం లో LM కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న SI, కానిస్టేబుల్ పోటీల పరీక్షల శిక్షణ తరగతులకు ముగింపు కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర సంక్షేమ శాఖ కొప్పుల ఈశ్వర్ ఎల్.యం కొప్పుల ఆర్గనైజేషన్ ఛైర్ పర్సన్ స్నేహలత పాల్గొన్నారు


కొండగట్టు ఘాట్ రోడ్డు పునః ప్రారంభం
నాలుగు ఏండ్ల క్రితం సెప్టెంబర్ 2018 లో కొండగట్టు బస్సు ప్రమాదం జరిగి 64 మంది మరణించగా, ఈ ప్రమాద ఘటన సందర్భంగా ప్రభుత్వం ఘాట్ రోడ్డు ను సర్కార్ మూసివేశారు.
గురువారం ఘాట్ రోడ్డు ను మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మేల్యే సుంకే రవిశంకర్ ప్రజాప్రతినిధులు ప్రారంభించారు
ఘాట్ రోడ్డులో కేవలం కార్లు, ఆటో లు, బైక్ లకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు.
కొండగట్టు బస్ ప్రమాదం తర్వాత నేడు ఘాట్ రోడ్డు ప్రారంభంతో , భక్తజనం హర్షం వ్యక్తం చేస్తున్నారు.


కార్యకర్తల సమావేశం!
జిల్లా కేంద్రంలో బిజెపి అధ్యక్షుడు మోరపల్లి సత్యనారాయణ రావు ఆద్వర్యం లో భారతీయ జనతా పార్టీ జగిత్యాల నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం.,
ముఖ్య అతిథిగా విచ్చేసిన ఢిల్లీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మనోజ్ తివారీ.