జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ఛైర్మన్ పత్తిపాక వెంకటేష్, మరియు పాలకవర్గం సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి ముఖ్య ఆతిథులుగా హాజరైన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ జెడ్పీ చైర్మన్ శ్రీమతి దావ వసంత సురేష్ ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతాంగానికి ఇబ్బందులు కలగకుండా త్వరితగతిన దాన్యం కొనుగోలు చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో DCMS ఛైర్మెన్ శ్రీకాంత్ రెడ్డి, జెడ్పీటీసీ సుధారాణి, ఎంపీపీ లక్ష్మి, సర్పంచ్లు ,ఎంపీటీసీలు, పాక్స్ చైర్మన్లు మరియు ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు,తదితరులు పాల్గొన్నారు.
వెల్గటూర్ మండల కేంద్రంలో దళిత బంధు పథకం ద్వారా మంజూరైన లబ్దిదారుల యూనిట్ లను ప్రారంభించిన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత తదితరులు పాల్గొన్నారు.

పట్టుదలతో చదివితే విజయం మీదే –
ఎస్పీ సింధు శర్మ !
ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకొని, పక్కా ప్రణాళికతో,మారిన పరిస్థితులు కు అనుగుణంగా ప్రిపరేషన్ ప్రారంభిస్తే తప్పకుండా ఉద్యోగం సాధించవచ్చని జిల్లా ఎస్పీ సింధు శర్మ అన్నారు.. సోమవారం SKNR డిగ్రీ కళాశాల మైదానంలో నిరుద్యోగ యువతీ ,యువకుల కొరకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే Pre-Coaching అవుట్ డోర్ కోచింగ్ ను జిల్లా అదనపు ఎస్పీ తో కలిసి సందర్శించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… ఈ 85 రోజుల శిక్షణ పూర్తయిందంటే .. మీరు మొదటి ఎక్కినట్టే అని .. మీకు ఒక బలమైన సంకల్పం ఏర్పడిందన్నారు. Pre-Coaching ను మీరందరూ సరైన విదంగా ఉపయోగించుకొని ఉద్యోగం సాధిస్తారనే నమ్మకం మాకు ఉందని .. కాబట్టి మీరందరూ ఆత్మవిశ్వాసంతో కష్టపడి చదవాలని సూచించారు. .

ఈ యొక్క Pre-Coaching వల్ల మీకు పోలీస్ ఉద్యోగల పట్ల, ఒక అవగాహన కలిపించాగాలిగమని అన్నరు. పోలీస్ సెలక్షన్ ప్రాసెస్ గురించి మరియు ఎగ్జామ్ పేపర్ గురించి మరియు చదవాల్సిన బుక్స్ గురించి నిపుణులైన వారిచే కోచింగ్ ఇవ్వడం జరిగిందన్నారు. పోలీస్ సెలక్షన్ ప్రాసెస్ అనేది ప్రిలిమినరీ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, అండ్ ఫైనల్ ఎగ్జామ్ మూడు దశలో ఉంటుందని ఇందులో నిర్దిష్ట ప్రణాళికతో, సరైన అవగాహనతో ముందుకు వెళితేనే ఉద్యోగం సాధించవచ్చని అన్నారు. పోలీస్ సెలక్షన్ ప్రాసెస్ ,EXAM , ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ గురిచి ఎలాంటి సందేహాలు ఉన్న నిర్బయంగా మా యొక్క అధికారులను సంప్రదించాలని సూచించారు. ప్రస్తుత రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాలకు చాలా కాంపిటీషన్ ఉందని కావున సమయాన్ని అందరూ సరైన విధంగా ఉపయోగించుకుంటూ మారిన పరిస్థితులకు అనుగుణంగా ప్రిపరేషన్ చేసుకోవాలని సూచించారు. కొద్దిరోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని సోషల్ మీడియాను, సెల్ ఫోన్ ను ఎంత వరకు అవసరమో అంతే మాత్రమే ఉపయోగించుకోవాలని సూచించారు.

.అభ్యర్థుల కోరిక మేరకు ప్రతి వారం లో ఒక రోజు ప్రాక్టీస్ ఎగ్జామ్స్ ను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఎవరైనా డబ్బులకు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పితే నమ్మవద్దని అలా ఎవరైన ఉద్యోగాలు ఇస్తామని చెపితే స్థానిక పోలీస్ వారికీ సమాచరం అందించాలని సూచించారు. అనంతరం అవుట్ డోర్ కోచింగ్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన యువతీ యువకులకు బహుమతులు అందజేశారు.
ఈ యొక్క కార్యక్రమంలో అదనపు ఎస్పీ రూపేష్ డిఎస్పి లు ప్రకాష్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు వామనమూర్తి, నవీన్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ లు కృష్ణ గౌడ్, వినోద్ రెడ్డి, మరియు డిస్టిక్ గార్డ్ సిబ్బంది పాల్గొన్నారు.

బాలికలకు సైకిళ్లు పంపిణీ !
బీర్పూర్ మండలం తాళ్ళధర్మారం ప్రాథమికోన్నత పాఠశాలలో WHY (we help you) .team (Dharmapuri ) వారి ఆధ్వర్యంలో సైకిళ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. గొల్లపెల్లి గణేష్ సార్, j.సుముఖ్ మరియు WHY Team సభ్యుల అందరికి సర్పంచ్, పాఠశాల విద్యకమిటీ మరియు. ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు ప్రత్యేకధన్యవాదములు తెలిపారు . ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నల్ల మహిపాల్ రెడ్డి, MEO V. భీమయ్య, HM N. విజయలక్ష్మి, చైర్మెన్ మ్యాకల మల్లేశం, ఉపాద్యాయులు మరియు గ్రామస్తులు బర్ల రాజేశం, శనిగరపు భూమేష్, నల్ల గంగారెడ్డి, బండ మహేష్ తదితరులు పాల్గొన్నారు.

రేపటి నుండి రైతుబంధు రైతుల ఖాతాలలో జమ!
రాష్ట్రం లోని 68.10 లక్షల మంది రైతుబంధుకు అర్హులు
కోటి 50 లక్షల 43 వేల 606 ఎకరాలకు అందనున్న సాయం
పంపిణీకి సిద్దంగా రూ.7521.80 కోట్లు !
వ్యవసాయ శాఖకు వివరాలు అందించిన సీసీఎల్ఎ
ఎకరాల వారీగా బిల్లుల జాబితా రూపొందించి ఆర్థికశాఖకు అందించిన వ్యవసాయ శాఖ
వానాకాలం రైతుబంధు నిధుల పంపిణీకి అంతా సిద్దం
మొదటిసారి రైతుబంధు తీసుకునే రైతులు అధికారులను కలిసి పట్టాదార్ పాసుబుక్కు, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వాలి

అధిక వడ్డీలు వసూలు చేస్తున్న వారిపై కేస్!
₹ 10 లక్షల నగదు స్వాధీనం !
నమోదు చేసిన కోరుట్ల పోలీసులు
కథలాపూర్ మం. తాండ్రియాల కు చెందిన మామిడిపల్లి తిరుపతి, రమ భార్యా భర్తలు ప్రజల అవసరాల నిమిత్తం వడ్డీ కి ఇస్తూ, వారిని వేధిస్తూ అధిక వడ్డీ 10% నుండి 30% వరకు అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారని సమాచారం తో కోరుట్ల సీఐ రాజశేఖర్ రాజు ఆద్వర్యం లో పోలీసులు వారి ఇంటిపై దాడి చేయగా, వారి వద్ద నుండి సుమారు ₹ 1 కోటి 30 లక్షల రూపాయల విలువగల ప్రాంసరీ నోట్లు, పలు బ్యాంక్ లకు చెందిన బ్లాంక్ చెక్కులు, బాండ్ పేపర్లు,15 తులాల బంగారు ఆభరణాలు, ఖాతా బుక్కు లు, ₹ 10 లక్షల 52 వేల నగదు స్వాధీనం చేసుకొని కేస్ నమోదు చేశారు.,

ఈ సందర్భంగా కోరుట్ల సీఐ రాజశేఖర్ రాజు మాట్లాడుతూ ప్రజలు వారి అవసరాల నిమిత్తం, నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు వడ్డీ ఇస్తూ వ్యాపారులు వారిని వేధిస్తూ అధిక వడ్డీ లు వసూలు చేస్తు, వారిని మరింత అప్పుల ఊబి లోకి లాగుతున్నరని, ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకొంటామని ఆయన హెచ్చరించారు.,
ఈ సమావేశం లో కోరుట్ల ఎస్సై లు సతీష్, శ్యామ్ రాజ్, కథలాపూర్ ఎస్సై రజిత, పొలీస్ సిబ్బంది పురుషోత్తం, మదన్ లాల్, కీర్తి లు పాల్గొన్నారు.,