ఆసరా తో ఆత్మవిశ్వాసం పెంచాం…
ఆత్మీయ బంధువు కెసీఆర్ – మంత్రి కొప్పుల

పెన్షన్ లను పెంచి పేదల్లో ఆత్మగౌరవం మరింత పెరిగింది -మంత్రి కొప్పుల

డబుల్ ఇంజిన్ల పేరుతో రాజకీయం చేస్తున్న కమలనాథులు -మంత్రి కొప్పుల

(J. Surender Kumar)
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం యంపిడిఓ కార్యాలయం లో 1624 కొత్త ఆసరా పిన్షన్ మంజూరు పత్రాలను, 48 మంది 49 లక్షల రూపాయల కళ్యాణ లక్ష్మీ చెక్కులను లబ్దిదారులకు పంపిణీ అనంతరం
ధర్మపురి మండలం SH గార్డెన్స్ లో 1567 కొత్త ఆసరా పిన్షన్ మంజూరు పత్రాలను, 59 మంది కళ్యాణ లక్ష్మీ చెక్కులను లబ్దిదారులకు జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత, ధర్మపురి మున్సిపల్ చైర్ పర్సన్ సంగీ సత్యమ్మ, జెడ్పిటిసి సభ్యురాలు బత్తిని అరుణ, మండల పరిషత్ అధ్యక్షుడు ఎడ్ల చిట్టిబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందారపు రామయ్య, డిసిఎంఎస్ ఛైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి తో పంపిణీ చేసిన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.‌…
కాంగ్రెస్ ప్రభుత్వం 75 రూపాయల పెన్షన్ ఇస్తే.. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ రెండు వేలు, మూడు వేల పెన్షన్ ఇస్తున్నారు.
పెద్ద బడాయిలు చెప్పే మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో ఇచ్చే పింఛన్ రూ. 750 మాత్రమే అని మంత్రి గుర్తు చేశారు..


సీఎం కేసీఆర్ కి సంతృప్తినిచ్చే పథకం ఆసర పథకం, పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి సీఎం కేసీఆర్ గారు అని మంత్రి అన్నారు
*వృద్ధులు, వితంతులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు, నేత, గీత, డయాలసిస్, బోధకాలు బాధితులకు అండగా ఆసరా పథకాలు అందిస్తూ గొప్ప మానవతా వాదిగా,మనసున్న నేతగా ముఖ్యమంత్రి కేసీఆర్


*దేశంలో వ్యవసాయానికి నిరంతరం ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
*ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలోనూ విద్యుత్ ఛార్జీల వాతలు
*ప్రతి నెల ఒక్కో హెచ్.పీకి యూనిట్ కు రూ. 200 వసూలు
*బావులకు మోటార్లు అమర్చిన మోటర్లకు ప్రతి నెల ఒక్కో హెచ్.పీకి యూనిట్ కు రూ. 20, యూనిట్ కు రూ. 60 పైసలు వంతున వసూలు
*తత్కాల్ పద్దతిలో ఒక్కో హెచ్.పీకి యూనిట్ కు రూ. 20, యూనిట్ కు రూ. 80 పైసలు వంతున వసూలు చేస్తున్నారు..


*మధ్యప్రదేశ్ లో వ్యవసాయ పంపు సెట్లకు నెలకు 300 యూనిట్ల వరకు ఒక్కో యూనిట్ కు రూ. 4.79 చొప్పున…ఒక్కో హెచ్.పీకి రూ.58 వసూలు
*300 నుంచి 750 యూనిట్ల వరకు యూనిట్ కు రూ. 5.83, ఒక్కో హెచ్.పీకి రూ. 74 చొప్పున వసూలు చేస్తున్నారు
*నెలకు 750 యూనిట్లకు పైగా విద్యుత్ ఉపయోగించిన రైతుల నుంచి యూనిట్ కు రూ. 6.10. ఒక్కో హెచ్.పీకి రూ.81 చొప్పు వసూలు చేస్తున్నారు
*అందరికి ఆసరా అందిస్తూ ఇంటి పెద్ద కొడుకుగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిలుస్తున్నారని అన్నారు, అన్నం పెట్టిన సీఎం కెసిఆర్ ను మరువద్దని మంత్రి అన్నారు.

ఉపాధ్యాయులకు సన్మానం!


ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కాషెట్టి.రమేష్ గారికి,మ్యాన.సునితలకు జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డ్ పొందిన సందర్భంగా ధర్మపురి లైన్స్ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ రామకృష్ణ, లైన్స్ సభ్యుల సమక్షంలో ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు

ధర్మపురి నరసింహుడి ఆదాయం ₹ 28 లక్షలు!


ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి హుండీ ఆదాయం ₹28,12,877/- రూపాయలు వచ్చింది. 67 గ్రాముల మిశ్రమ బంగారం 3 కిలోల 780/- గ్రాముల మిశ్రమ వెండి, 7 విదేశ నోట్లు వచ్చాయి. కేవలం 75 రోజుల నుండి ఆలయం ఆలయ కార్య నిర్వహణ అధికారి సంకటాల శ్రీనివాస్ వివరించారు. ఈ కార్యక్రమంలో ఏసీ చంద్రశేఖర్ ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.