అటవీ గ్రామ హాస్టల్లో ఆకస్మిక తనిఖీలు. చేసిన
జగిత్యాల కలెక్టర్ రవి !


( J.Surender Kumar)


ప్రభుత్వ హాస్టల్లో విద్యార్థులు. సమస్యలు సౌకర్యాలు జిల్లా కలెక్టర్ బుధవారం అతని ప్రాంతంలోని. ప్రభుత్వ హాస్టలు ఆశ్రమ పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు, జరిపి విద్యార్థుల యోగక్షేమాల వారిని అడిగి తెలుసుకున్నారు. ఇటీవల రాష్ట్రంలో నెలకొన్న హాస్టల్ విద్యార్థుల ఇబ్బందులు, అనారోగ్యం భారీ పడడం నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టినట్లు చర్చ.. వివరాల్లోకి వెళితే

వంటగది భోజనం ను తనిఖీ చేస్తున్న కలెక్టర్


బీర్పూర్ మం. చిత్రవేనిగూడెం మంగేళ ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాల బాలురు మరియు బాలికల హాస్టల్ ఆకస్మికంగా తనిఖీలు కలెక్టర్ చేశారు.


ఈ సందర్భంగా పాటశాల లోని డార్మెంటి హాల్, స్టోర్ రూమ్ కిచెన్, డైనింగ్ హాల్ , బాత్రూమ్స్, తనిఖీలు చేశారు. తర్వాత క్లాస్ రూమ్ లోని విద్యార్థి ,విద్యార్థులతో హాస్టల్ లో సమస్యలు అడిగి తెలుసుకున్నారు., హాస్టల్ లో టిఫిన్, మరియు భోజనం ఎలాంటి పెడుతున్నారని విద్యార్థులు అడిగి తెలుసుకొన్నారు,

విద్యార్థులకు నైపుణ్యమైన విద్య మరియు నైపుణ్యమైన భోజనం, విద్యార్థులకు అందించాలని ఎక్కువ మంది విద్యార్థులు ఉండేలా చూడాలని అధికారులకు ఆదేశించారు,
కలెక్టర్ తో అదనపు కలెక్టర్ బిఎస్ లత, ఆర్డీవో మాధురి మండల స్పెషల్ అధికారి రాజ్ కుమార్, గిరిజన సాంఘిక సంక్షేమ అధికారి ఎమ్మార్వో ప్రిన్సిపల్ మరియు వివిధ శాఖ అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

కాంగ్రెస్ హయాంలో ఉచిత కరెంట్ కాదు.. ఉత్త కరెంట్. ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్, జడ్పీ చైర్మన్ దావ వసంత

అర్బన్ మండలంలోని థరూర్, మోతె, తిప్పన్నపెట్, హస్నాబాద్, అంబరిపెట్ గ్రామాల్లో నూతన ఆసరా పింఛన్లు, కళ్యాణ లక్ష్మి,సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్, జెడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి దావ వసంత సురేష్ లు..
ఈ సందర్భంగా జెడ్పీ ఛైర్మెన్ మాట్లాడుతూ..
*- కొత్తగా ఆసరా పింఛన్లు అందుకుంటున్న 390 మందికి శుభాకాంక్షలు. ఇకనుంచి మీకు నెల నెల రూ. 2016 అందుతాయి.

  • చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు పింఛన్ రు. 75 ఉండే. ఎవరైనా చనిపోతేనే తప్ప వారి స్థానంలో నాడు కొత్తవి ఇచ్చేవి కావు.
  • ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 200 చేసింది. కానీ ఒంటరి మహిళలకు, చేనేత, గౌడ పింఛన్లు ఇవ్వలేదు.
  • కానీ మేము మాత్రం ఏకంగా 10 ఇంతలు పెంచి, రు. 2016 చేసాము. పింఛన్ల డబ్బు పెరిగింది పింఛన్ల సంఖ్య పెరిగింది. ఇది మా ప్రభుత్వంలో జరిగిన మార్పు.

*అర్హులైన ప్రతి పేదవాడికి ఇస్తాం. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

*కన్న కొడుకు చీర కొని ఇవ్వకపోయినా పెద్ద కొడుకు కేసీఆర్ గారు బతుకమ్మ చీర ఇస్తున్నరు. బిడ్డ పెళ్లికి కళ్యాణ లక్ష్మి ఇస్తున్నరు

ఎమ్మేల్యే మాట్లాడుతూ

కుల మతం భేదం లేకుండా పేదలందరికీ భరోసా ఇవ్వడమే మా ప్రభుత్వ లక్ష్యం.

-*కరోనా వల్ల కొంత ఇబ్బంది ఉన్నా పేదలను కడుపులో పెట్టుకొని చూసిన ముఖ్యమంత్రి కెసిఆర్ గారు. పది కిలోల బియ్యం,1500 రూపాయలు ఇచ్చాడు. సమయానికి పింఛన్లు ఇచ్చారు.

*ఢిల్లీలో కూర్చున్న వారు కాళేశ్వరం మీద విమర్శలు అర్దరహితం.

  • భూమికి బరువయ్యే పంట పండుతుంది. సీఎం కేసీఆర్ గారు రైతు పక్షపాతి కాబట్టి ఇది సాధ్యం అయ్యింది.

*కొంత మంది ఉచితాలు వద్దు అంటారు.
కాంగ్రెస్ జమానాలో ఉచిత కరెంట్ కాదు ఉత్త కరెంట్.

*రైతు చనిపోతే కుటుంబం రోడ్డు న పడకుండా రైతు భీమా …

*ప్రతి కుల సంఘాల,కుల వృత్తులు అభివృద్ధికి ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్నారు.

*పల్లే ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామానికి ట్రాక్టర్ ట్యాంకర్ కంపోస్ట్ షెడ్డు వైకుంఠధామం పల్లె ప్రకృతి వనం ఇలా పల్లెలు పచ్చదనంతో పరిశుభ్రత తో పట్టణాలకు దీటుగా ఉన్నాయి.

*కేంద్ర ప్రభుత్వం వైఖరి వల్ల తెలంగాణకు రావలసిన నిధుల విడుదలలో జాప్యం, కక్షపూరిత ధోరణి అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వం అని అన్నారు

*పెట్రోల్ డీజిల్ గ్యాస్ పాలు పాల ఉత్పత్తులు ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్న కేంద్ర సర్కారు

*సంపద పెంచి పేదలకు పెంచాలని లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు పనిచేస్తే కేంద్ర ప్రభుత్వం మాత్రం పేదల సొమ్మును పెద్దలకు పంచే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

జ్యోతి హై స్కూల్ లో ఘనంగా ఓనం పండుగ ఉత్సవాలు


ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ శ్రీ బియ్యల హారి చరణ్ రావు మాట్లాడుతూ “ఓణం ఆధునిక కాలంలో కూడా ఇంకా జరుపుకొనే ఒక ప్రాచీన పండుగ. మలయాళ మాసం చింగంలో వచ్చే కేరళ యొక్క వరికోత పండుగ, వర్షపు పువ్వుల పండుగ, పాతాళం నుండి మావెలి రాజు యొక్క వార్షిక ఆగమనాన్ని వేడుకగా చేసుకుంటాయి. చరిత్ర పూర్వం నుండి కేరళ ప్రజలు మవేలి చక్రవర్తిని పూజించటం మూలంగా ఓణం ప్రత్యేకమైంది., చరిత్ర ప్రకారం, మహాబలి పాలించిన సమయం కేరళకు స్వర్ణ యుగం.మహాబలి యొక్క ఈ ఆగమనమునే ప్రతి సంవత్సరము ఓణం పండుగగా జరుపుకుంటారు. అదే విధంగా పాఠశాల ఆవరణలో వివిధ రకాల పుష్పాలతో ,ముగ్గులు వేసి ఆలంకరించారు. విద్యార్థినిలు కేరళ సంప్రదాయ దుస్తులలో పాఠశాల కి వచ్చారు.


ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు బియ్యల హారిచరణ్ రావు, శ్రీధర్ రావు, మౌనిక రావు, అజిత రావు, రజిత రావు, కేరళ ఉపాధ్యాయులు రాజేష్ , అనురాజ్, మోలీ బీజ్జు పాల్గొన్నారు.

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ !

జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలం తుంగూర్ గ్రామానికి చెందిన వట్కపురం రాజవ్వ కు CM RF చెక్కు రూ” 18.000/- మరియు చేట్లపల్లి లచ్ఛవ్వ కు CM RF చేక్కు రూ” 12.000/- మరియు బండారి భూమక్క కు CM RF చేక్కు రూ” 10.000/- మొత్తం రూ” 40.000/- ల చేక్కులను MLC తాటిపర్తి జీవన్ రెడ్డి వారి సహాయ సహకారంతో ఈరోజు తుంగూర్ గ్రామ సర్పంచ్ గుడిసె శ్రీమతి జితేందర్ యాదవ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ పూడురి రమేష్ మరియు వార్డు సభ్యులు అడేపు సరోజన మల్లేశం.బండారి అనురాధ.ఉయ్యాల శంకరమ్మ.చుంచు ప్రమీల రమేష్. దండికే భాగ్య పాల్గొన్నారు