రామగుండం ఫర్టిలైజర్  బాధితులకు న్యాయం చేయాలి!

మంత్రి నైతిక బాధ్యత వహించాలి..
ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి

అక్రమ వసూళ్లకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి
బాధితులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దు..
ఆత్మహత్యలకు పాల్పడవద్దు..
న్యాయం జరిగే వరకూ కాంగ్రెస్ పోరాటం చేస్తుంది
బాధితుల తరపున నిరసన వ్యక్తం చేసేందుకు వెళ్తున్న కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయడం ప్రజాస్వామికం


రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ లో పర్మినెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అక్రమ వసుళ్లకు  పాల్పడిన టిఆర్ఎస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని, మంత్రి కొప్పుల ఈశ్వర్ నైతిక బాధ్యత వహించి బాధితులకు న్యాయం చేయాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.
మల్యాల మండల కేంద్రంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు., రామగుండం ఫెర్టిలైజెర్స కంపెనీ బాధితుల కు న్యాయం చేయాలని నిరసన వ్యక్తం చేసేందుకు వెళ్తున్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ తో పాటు కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేసి మల్యాల పోలీస్ స్టేషన్ తరలించడానికి తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
బాధితుల తరఫున నిరసన వ్యక్తం చేసే హక్కు కూడా లేదా అని ప్రశ్నించారు. ప్రాణ త్యాగాలు చేసి తెలంగాణ సాధించుకున్నది ఇందు కోసమేనా, రాష్ర్టంలో నియంతృత్వ పాలన కొనసాగుతోందని అన్నారు.
ఎమ్మెల్యే ముఖ్య అనుచరులు, ఉద్యోగాల పేరిట నిరుద్యోగుల నుండి సుమారు 50లక్షలు వసూలు చేశారని ఆరోపించారు., పోలీసుల నిర్లక్ష్యంతోనే హరీష్ ఆత్మహత్య చేసుకున్నాడని, పోలీసులు కూడా బాధ్యత వహించాలన్నారు., ఎమ్మెల్యేకు అక్రమ వసూళ్లతో సంబంధం లేకుంటే  డబ్బులు ఇచ్చే బాధ్యత నాదే నంటూ  భాదితులకు ఎందుకు హామీ ఇచ్చారని నిలదీశారు. తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని ఆడిగినందుకు అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసం అని అన్నారు. ఎక్కువ జీతం ఇస్తారని,
పర్మినెంట్ చేస్తారని నమ్మించి, ఒక్కొక్కరి నుండి 5-I0 లక్షలు వసూలు చేసి నిరుపేదలను దోచుకున్నారన్నారు.
బాధితులు ఆత్మస్థర్యంతొ ఉండాలని, ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఎమ్మెల్సీ జీవన రెడ్డి కోరారు. బాధితులకు న్యాయం జరిగేవరకు కాంగ్రెస్ పోరాటం చేస్తుందని అన్నారు. టీఆర్ఎస్ నాయకుల పై చర్యలు తీసుకోవాలని, మంత్రి కొప్పుల ఈశ్వర్ బాధ్యత వహించాలని జీవన్ రెడ్డి అన్నారు.

పరామర్శ


జగిత్యాల పట్టణంలోని సారుగమ్మ వీధిలో జైశెట్టి రాజమనోహర్, రాజ కిషన్ తల్లి శంకరమ్మ గారు గుండె పోటు తో మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ గారు.,

వారి
వెంట కౌన్సిలర్ లు కప్పల శ్రీకాంత్,  బోడ్ల జగదీష్, నాయకులు బోలుసాని శ్రీనివాస్, తదితరులు ఉన్నారు


రాయికల్ మం. ఇటిక్యాల గ్రామానికి చెందిన టిఆర్ఎస్ నాయకులు రైతు గడ్డం రాజారెడ్డి పిడుగుపాటుతో మరణించగా వారి కొడుకు మహేష్ ను మరియు వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, వెంట ఎంపీపీ సంధ్యారాణి సురేందర్ నాయక్, వైస్ ఎంపీపీ మహేశ్వర రావు, మండల పార్టీ ఉపాధ్యక్షులు మర్రిపల్లి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఏఎంసి వైస్ చైర్మన్ కొల్లూరు వేణు, తదితరులు ఉన్నారు.

డిసిసి అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ అరెస్ట్!


పెద్దపల్లి జిల్లా రామగుండం RFCL బాధిత కుటుంబాలకు మద్దతుగా రాజారాంపల్లి లో జరిగే ధర్నాకు బయలు దేరిన జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ధర్మపురి నియోజకవర్గం ఇన్చార్జి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను పెద్దపల్లి జిల్లా దర్మారం లో అరెస్టు చేసి జగిత్యాల జిల్లా మల్యాల పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు .,

పరామర్శ!


పట్టణంలో ఇటీవల రాచకొండ పృద్వి గారు,  రిటైడ్ MVO వెంకట కిషన్ గారు, జైషెట్టి శంకరమ్మ లు మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి


పెన్షన్ కార్డుల పంపిణీ!


రాయికల్ మం. జగన్నాథ్ పూర్ లో 19 మందికి నూతన పెన్షన్ కార్డ్ లను పంపిణీ చేసిన ఎమ్మేల్యే డా. సంజయ్ కుమార్,  ఈ కార్యక్రమంలో ఎంపీపీ సంధ్య రాణి సురేందర్ నాయక్, మండల పార్టీ అధ్యక్షుడు కొల శ్రీనివాస్, వైస్ ఎంపీపీ మహేశ్వర రావు,సర్పంచ్ అత్రం విజయ లక్ష్మి బీర్శా,ఎంపీటీసీ పెండ్రెం కవిత శ్రీనివాస్ మాజీ సర్పంచ్ సిడెం భీమ్,సర్పంచ్ జక్కుల చంద్ర శేకర్,నాయకులు పాదం రాజు,కంటే గంగారాం,మాజీ సర్పంచ్ అంజయ్య, తదితరులు ఉన్నారు.
చీఫ్ సెక్రటరీ వీడియో కాన్ఫరెన్స్!


తెలంగాణ సమైక్య జాతీయ దినోత్సవం మరియు వజ్రోత్సవంలో భాగంగా 33 జిల్లా కలెక్టర్లతో ఎస్పీలతో వీడియోకాన్సులో  సమీక్షిస్తున్న  సిఎస్ సోమేశే కుమార్ డిజిపి మహేందర్ రెడ్డి.

సిబ్బందికి  చెత్త సేకరణ కోసం చెత్త సేకరణ బండ్ల పంపిణీ  


ఈ సందర్భంగా చైర్పర్సన్  డాక్టర్ బోగా శ్రావణి ప్రవీణ్ మాట్లాడుతూ కౌన్సిల్ సభ్యుల తో కలిసి జవాన్ మరియు శానిటేషన్ సిబ్బందికి చెత్త సేకరణ బండ్లు ఇవ్వడం జరిగినది., గతం లో వాహనాల సంఖ్య 17 మాత్రమే ఉన్నవి .మా పాలకవర్గం వచ్చాక స్వచ్ ఆటోస్, ట్రాక్టర్, జెసిబి,బ్లెడ్ ట్రాక్టర్,టిప్పర్ ఇలా వహనాలు తీసుకొని వాహనాల సంఖ్య 62 కి గణనీయంగా పెంచడం జరిగినది.పెరుగుతున్న జనాభా దృశ్య  మరి సౌకర్యాలు కూడా అత్యాధునికంగా కలిపించాలనే ఉద్దేశ్యం తో  వాహనాలు ఎక్కడికక్కడ పెంచడం జరిగినది.ఇవన్నీ తీసుకొని ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూస్తున్నాం ,అక్కడక్కడ చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని మా పాలక వర్గం మరియు అధికార యంత్రంగం  పరిశీలించి పూర్తి చేస్తున్నాం,అలాగే సీజనాలు వ్యాధులు ప్రబలుతున్న దృష్ట్యా ప్రతి ఒక్కరు తమ చుట్టు పక్క పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అలాగే పట్టణ ప్రజలు దుకరదారులు హోటల్ యజమానులు తమ తమ దగ్గర ఉండే చెత్తని తడి పొడి చెత్తగా వేరు చేసి తమ పరిసరాలకు వచ్చిన మన మున్సిపల్ వాహనానికి ఇచ్చి సహకరించాలని తెలిపినరు.. మా శానిటేషన్ సిబ్బంది ఎప్పటికప్పుడు ప్రతి వార్డ్ లో మస్కిటో స్ప్రే మరియు ఫాగింగ్  చేస్తున్నారు..
ఈ కార్యక్రమంలో వైస్ చెర్మెన్ గోలి శ్రీనివాస్,కౌన్సిల్ ఫోరమ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బోడ్ల జగదీష్,కౌన్సిల్ ఫోరమ్ జిల్లా అధ్యక్షులు పంబల రాము, కౌన్సిలర్స్, de రాజేశ్వర్,si బలే ఎల్లం,అశోక్,హెల్త్ అసిస్టెంట్ లత,నాయకులు ,శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.