లాక్ డౌన్ లో లక్షల ఖర్చులా?
( J. Surender Kumar)
శ్రీ దుబ్బ రాజేశ్వర స్వామి ఆలయంకు చెందిన ఆదాయంను కొందరు ఇష్టానుసారంగా దులుపుకుంటున్నారు అని భక్తులు ఆరోపిస్తున్నారు. కోవిడ్-19, లాక్ డౌన్, సమయంలో భక్తుల సౌకర్యాల కల్పన కోసం లక్షల రూపాయలు ఖర్చు చేసినట్టు ఆలయ రికార్డులలో నమోదు కావడంతో భక్తుల ఆరోపణలకు. బలం చేకూరుస్తున్నది.

జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం, పెంబట్ల- కోనాపూర్ గ్రామంలో అతి ప్రాచీన శ్రీ దుబ్బ రాజేశ్వర స్వామి, ఆలయంకు ఎనలేని ప్రత్యేకత ఉంది, పచ్చని అడవులు, ప్రశాంత పల్లె వాతావరణం లో ఆలయం ఉంది. దాదాపు 80 శాతం గ్రామీణులకు ఇష్ట దైవం, దుబ్బ రాజన్న, ఇవేల్పు కూడ. కోరిన కోర్కెలను తీర్చే దైవంగా అపార నమ్మకం, విశ్వాసంగా గల ఆలయంలో ప్రసిద్ధి గాంచింది.

ఆదాయ, ఖర్చు వివరాలు!
.2020 ఏప్రిల్ మాసం నుంచి 2021 మార్చి మాసం వరకు. ఆలయముకు వచ్చిన ఆదాయం ₹ 74,70,049/- కాగా ఖర్చు ₹ 74,11,865,/- జరిగినట్టు ఆలయ రికార్డులో ఉంది.
ప్రభుత్వం అధికారికంగా లాక్ డౌన్ ప్రకటించిన వివరాలు !
25, మార్చ్ 2020 నుండి.14 ఏప్రిల్ మాసం వరకు. (21 రోజులు) 15, ఏప్రిల్ 2020, నుండి. 3 మే మాసం వరకు (19 రోజులు), .4 మే 2020 నుండి 17 మే మాసం వరకు (14 రోజులు) 18 మే 2020 నుండి 31 మే మాసం. వరకు (14 రోజులు).
2021 సంవత్సరంలో..
12 మే 2021నుండి 9 జూన్ మాసం వరకు, 10 జూన్ 2021 నుండి 19 జూన్ మాసం 2021 వరకు లాక్ డౌన్ అధికారికంగా అమలులో ఉన్నట్టు రికార్డులలో ఉంది. లాక్ డౌన్ ఎత్తివేసినా, కొన్ని నెలల పాటు, శుభకార్యాలు, సభలు, సమావేశాలు, ఊరేగింపులు, వ్యాపార , విద్యాసంస్థలలో, సమయపాలన ,ఫంక్షన్ హాల్ , ఆలయాలు, ప్రార్థన మందిరాలు, పండుగలు , పర్వదినాల. సందర్భాలలో. ప్రభుత్వం పరిమిత సభ్యుల ప్రవేశాలకు ఆంక్షలు విధించి అమలుపరిచిన విషయం జగమెరిగిన సత్యం.
2020-2021 లో దుబ్బ రాజన్న ఆలయ ఖర్చులు వివరాలు మచ్చుకు కొన్ని.

జనరేటర్ నిర్వహణ డీజిల్ కోసం ₹ 50,000/- కోనేరు మరమ్మతులు నిర్వహణ ₹ 80,000/- మైనర్ రిపేర్ల పేరిట.₹ 1,79,700/- కరెంట్ బిల్లు ,సామాగ్రి & రిపేర్లు ₹ 1,99,982/- టి ఏ& డి ఏ ₹ 50,000/- చైర్మన్ కాన్వాయ్ అలవెన్స్. ₹ 1, 20, 000/- తాత్కాలిక చలువ పందిళ్లు ₹ 2, 29, 816/- చౌల్ట్రీ మరమ్మతులు ₹.69,750/-. VIP ల కోసం ₹ 40, 000/- ఫర్నిచర్ కొనుగోలు ₹ 69,585/- సీ.సీ కెమెరాలు ₹ 81,000/- గోశాల నిర్వహణ. ₹ 89,869/- ఇతరములు అంటూ ₹ 1, 69,945/- ఖర్చులు చేసినట్టు ఆలయ రికార్డులలో నమోదు చేశారు. ఈ ఖర్చులు భక్తుల సౌకర్యాల కల్పన కోసం కోవిడ్ -19. (లాక్ డౌన్) సమయంలో ఖర్చు చేయడం తో ఈ పద్దులకు భక్తులలో ఎనలేని ప్రత్యేకత సంతరించుకుంది.