(J. Surender Kumar)
గురువారం “సంకటహర చతుర్థి” సందర్భంగా, శ్రీలక్ష్మి నరసింహ స్వామి వారిఅనుబంధ దేవాలయమైన శ్రీరామలింగేశ్వరస్వామి దేవస్థానంలో గల గణపతి ఆలయంలో గణపతి ఉపనిషత్తులతో అబిషేకం, హరతి, మంత్రపుష్పం, కార్యక్రమలు జరిగాయి.

ఈ కార్యక్రమంలో దేవస్థానం సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ , రెనవేషన్ కమిటి సభ్యులు ఇందారపు రామయ్య , గునిశెట్టి రవీందర్ , చుక్కరవి , వేముల నరేష్ ,గందె పద్మ , సంగెం సురేష్ , అక్కనపల్లి సురేందర్, వేదపండితులు పాలెపు ప్రవీణ్ శర్మ , స్థానిక వేదపండితులు మధు రామశర్మ , అర్చకులు బొజ్జ సంతోష్ కుమార్, బొజ్జ రాజగోపాల్, ద్యావళ్ల విశ్వనాథం , ద్యావళ్ల సాయికుమార్, భక్తులు పాల్గొన్నారు.
తిరుమల ఆలయ సమాచారం!.

తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబరు 25న సూర్యగ్రహణం, నవంబరు 8న చంద్రగ్రహణం కారణంగా ఆయా రోజుల్లో 12 గంటల పాటు శ్రీవారి ఆలయ తలుపులు మూసివేస్తారు. బ్రేక్ దర్శనం, రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఇతర ఆర్జిత సేవలను టిటిడి రద్దు చేసింది. సర్వదర్శనం భక్తులను మాత్రమే అనుమతిస్తారు.
అక్టోబరు 25న మంగళవారం సాయంత్రం 5.11 గంటల నుండి 6.27 గంటల వరకు సూర్యగ్రహణం ఉంటుంది. ఈ కారణంగా ఉదయం 8.11 నుండి రాత్రి 7.30 గంటలకు శ్రీవారి ఆలయ తలుపులు మూసి ఉంచుతారు. అనంతరం సర్వదర్శనం భక్తులను మాత్రమే అనుమతిస్తారు.
అదేవిధంగా నవంబరు 8న మంగళవారం మధ్యాహ్నం 2.39 గంటల నుండి సాయంత్రం 6.27 గంటల వరకు చంద్రగ్రహణం ఉంటుంది. ఈ కారణంగా ఉదయం 8.40 నుండి రాత్రి 7.20 గంటలకు శ్రీవారి ఆలయ తలుపులు మూసి ఉంచుతారు. సర్వదర్శనం భక్తులను మాత్రమే అనుమతిస్తారు.
ఉచిత భోజనం ఉండదు!
సాధారణంగా గ్రహణం రోజుల్లో గ్రహణం తొలగిపోయే వరకు వంట చేయరు. తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఇతర ప్రాంతాల్లో కూడా అన్నప్రసాద వితరణ ఉండదు.
కావున భక్తులు ఈ విషయాన్ని గమనించి, అసౌకర్యానికి గురికాకుండా ఉండేందుకు వీలుగా తమ తిరుమల యాత్రను రూపొందించుకోవాలని టిటిడి విజ్ఞప్తి చెసింది.