అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు!


( J. Surender Kumar )
జగిత్యాల మున్సిపల్ పరిధిలోని 21, 28 వార్డులలో శుక్రవారం ఉదయము ఆకస్మిక తనికి చేసిన అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు మకరంద్ 21 & 28 & 37 వార్డులలో పారిశుద్ధ్య పనులు డ్రైనేజ్ క్లీనింగ్, తడి, పొడి చెత్త సేకరణ, గురించి ఎలా చేస్తున్నారని కార్మికులను అడిగి తెలుసుకున్నారు.

కార్మికులు సక్రమంగా సమయపాలన పాటించి పనిచేయాలని సూచించారు. 38 వార్డులో కుటుంబాలకు తడి పొడి చెత్త సేకరణ ఎలా చేయాలని డెమో ద్వారా చూపించారు.

నర్సింగాపూర్ లోని డంపింగ్ యార్డ్, కంపోస్ట్ యాడ్, fstp సందర్శించి రికార్డ్స్ పరిశీలించారు. అన్ని పనులు సక్రమంగా జరగాలని ఆదేశించారు. జగిత్యాల మున్సిపాలిటీ లోకల్ తెలంగాణ క్రీడా ప్రాంగణం, సందర్శించి అనుకున్న సమయంలో పనులు తొందరగా పూర్తి చేయాలని కమిషనర్ ను ఆదేశించారు

. ఈ పర్యటనలో మున్సిపల్ కమిషనర్ గంగాధర్, ఏవో శ్రీనివాస్ , కౌన్సిలర్ లు ఏ. ఈ అరుణ్, ఎస్ఐ రాము, మేప్మా సిబ్బంది ,డి ఎం సి సునీత, ఎంసి రజిత మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.