వివరాలు సేకరించిన విజిలెన్స్ శాఖ ?
₹ 7 లక్షల కు పైగా రికవరీ!
ప్రగతి భవన్ కు చేరిన కొండగట్టు ఫైల్ ?
( J.Surender Kumar )
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి, ఆలయ నిధుల గోల్ మాల్ పై విజిలెన్స్ శాఖ, వివరాలు సేకరించినట్టు తెలిసింది. కొండగట్టు ఆలయంలో నిధుల గోల్ మాల్ పై 'ఉప్పు' లో .ప్రచురితమైన వార్తా కథనాలు తెలిసిందే. బాధ్యుడైన ఓ ఉద్యోగి నుంచి గత సంవత్సరంలోనే దాదాపు ₹.7 లక్షల పైగా నిధులు రికవరీ చేసి ఆలయ ఖాతాలో జమ చేసినట్టు, వారి విచారణలో వెలుగు చూసినట్లు సమాచారం. కొండగట్టు నిధుల గోల్ మాల్ కు సంబంధించిన నివేదికను ప్రగతి భవన్ కు అధికారులు (సీఎంఓ ఆఫీస్) పంపినట్టు సమాచారం.

వివరాల్లోకి వెళ్తే.
కొండగట్టు ఆలయ నిధులు గోల్ మాల్ లో కొందరు అధికారులు ఇష్టానుసారంగా, రికార్డులలో ఆదాయం తగ్గించిన నమోదు చేయడం, తదితర అంశాలపై అక్టోబర్ మాసంలో ‘ ఉప్పు’ వార్త కథనాలు ప్రచురించింది. .ఈ కథనాలు, సోషల్ మీడియాలో, చక్కర్లు కొట్టడంతో. విజిలెన్స్ శాఖ, వివరాలు సేకరించినట్లు తెలిసింది.
₹ 7. లక్షల సొమ్ము ఆలయ ఖాతాలో జమ ?
ఆలయ ఆదాయ, ఖర్చుల రికార్డులు నమోదు చేసే అధికారి క్యాష్ బుక్ లో. జమ నమోదు, తక్కువగా చూపించడం, బ్యాంకులో అట్టినిధులు, జమ చేయకపోవడం, తదితర నిధుల గోల్ మాల్ అంశంపై, అనేక ఫిర్యాదులు, ఆడిట్ అభ్యంతరాల నేపథ్యంలో జి. శ్రీనివాస శర్మ, (సూపరిండెంట్) నుంచి గత సంవత్సరంలోనే లక్షలాది రూపాయల డబ్బులు రికవరీ ప్రక్రియకు, శ్రీకారం చుట్టినట్టు రికార్డులలో నమోదయింది.
క్యాష్ చెల్లిస్తావా? లేదా కేసు నమోదు చేయాలా ?
అనేక ఫిర్యాదులు, ఆడిటర్ అభ్యంతరల నేపథ్యంలో కొండగట్టు, కార్యనిర్వహణాధికారి, క్యాష్ బుక్ ( C.B ) నిర్వహించిన ఉద్యోగిని, దుర్వినియోగపరచిన నిధులను, క్యాష్ రూపంలో చెల్లిస్తావా.? నీపై కేసు నమోదు చేయమంటావా.,? అని హెచ్చరించడంతో. తేదీ 17 డిసెంబర్, 2020 న రిసిప్ట్ నెంబర్ 11409, ద్వారా. ₹ 2,లక్షలు, తేదీ 13 జనవరి, 2021న రిసిప్ట్ నెంబర్,11415, ద్వారా ₹ 1,12,330/- తదితర తేదీలలో దాదాపు ₹ 7,02,762/- రూపాయిలు వసూలు చేసి ఆలయ ఖాతాలో జమ చేసినట్టు రికార్డులలో నమోదైనట్టు సమాచారం. సదరు ఉద్యోగిని క్యాష్ బుక్ నిర్వహణ బాధ్యతల నుంచి తొలగించినట్లు సమాచారం. కొమరవెల్లి ఆలయం నుంచి బదిలీపై వచ్చిన మరో ఉద్యోగికి 2019 సంవత్సరంలో క్యాష్ బుక్ నిర్వహణ బాధ్యతలను అప్పగించినట్లు సమాచారం.

ఇది ఇలా ఉండగా 2014 విజిలెన్స్ అధికారులు, చేపట్టిన విచారణ నివేదిక ఆధారంగా నిధులు గోల్ మాల్ కు పాల్పడిన ఉద్యోగిని, దేవదాయ శాఖ, కొమరవెల్లికి ఆలయం బదిలీ చేసింది. ఇది ఇలా ఉండగా రెవెన్యూ శాఖకు చెందిన అప్పటి కార్యనిర్వహణాధికారి, విధుల నిర్వహణ తీరు తెన్నుల పై రెవెన్యూ ఇంటెలిజెన్స్ వర్గాల, ద్వారా వివరాలు సేకరించినట్లు సమాచారం. దుకాణాల నిర్వహణ, వేలం దారుల, కిరాయి డబ్బుల బకాయలు, వారి నుంచి వసూలు చేయుటకు. దేవాదాయ శాఖ ప్రభుత్వంకు ‘రెవెన్యూ రికవరీ చట్టాన్ని’ అమలు చేసి వసూలుకు అనుమతి కోరుతూ ప్రతిపాదనలు పంపినట్టు సమాచారం.
ప్రగతి భవన్ కు చేరిన ఫైల్ ?
కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ నిధులు గోల్ మాల్ అంశంపై సీఎం ఓ కార్యాలయంలో (ప్రగతి భవన్ లో). కీలక విధులు నిర్వహించే ఓ అధికారికి, జగిత్యాల్ డివిజన్ తో సంబంధాలు ఉన్నట్టు సమాచారం. సమగ్ర నివేదికను యంత్రాంగం సిద్ధం చేసి సీఎంవో కార్యాలయానికి గత నెలలో నివేదిక అందజేసినట్లు తెలిసింది.