తీన్ ఖని వద్ద స్మారక స్తూపం ఏర్పాటు చేయాలి.
( J.Surender Kumar)
భారతరత్న, భారత దేశ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు మరువలేనివని మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూత్ అధ్యక్షుడు ముజాహీద్ ఆదిల్ అన్నారు.
ఈ సందర్భంగా శుక్రవారం జగిత్యాల పట్టణంలోని తీన్ ఖని చౌరస్తా వద్ద మౌలానా అబుల్ కలాం ఆజాద్ 134వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూత్ అధ్యక్షుడు ముజాహీద్ ఆదిల్ మాట్లాడుతూ స్వాతంత్య పోరాటంలో ఆజాద్ త్యాగాలు వెలకట్టాలేనవన్నారు. ప్రముఖ విద్యావేత్త అయిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ దూర
దృష్టితో విద్యావ్యవస్థను దేశంలో పటిష్టం చేశారన్నారు. తన జీవితాన్ని దేశం కోసం అంకితం చేసిన గొప్ప నాయకులు అని, మౌలానా అబుల్ కలాం ఆజాద్ అడుగుజాడల్లో నడస్తూ ఆయన సేవలను స్మరించుకోవాలన్నారు.

జగిత్యాల జిల్లా కేంద్రం తో పాటు ఆయా మండలాలలో స్వాత్రంత్య సమర యోధుల విగ్రహాలు ఏర్పాటు చేశారని, దేశ స్వాత్రంత్య పోరాటంలో తన జీవితాన్ని ధార పోసిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్మారక చిహ్నంను ఏర్పాటు చేయడంలో మాత్రం ఎందుకు అలసత్వం వహిస్తున్నారన్నారు. ప్రభుత్వాన్ని, ప్రజాప్రతినిధులను ఎన్నో సార్లు విన్నవించిన మౌలానా స్మారక స్థూపాన్ని నిర్మించాలని పట్టించుకోవడం లేదని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి స్మారక స్థూపాన్ని నిర్మించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కో అప్షన్ రియాజ్ మామా, కాంగ్రెస్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు సిరాజ్ ఉద్దీన్ మన్సుర్, నాయకులు మొయిజ్ ఉద్దీన్, ఖాజా సుల్తాన్ ఉద్దీన్ అహ్మద్, ఇక్రమ్ ఉద్దీన్ సోహైల్, మహమ్మద్ నాజీమ్, సికందర్, రియాజ్, అబ్దుల్ రెహమాన్, వసి, ఖైసర్, హకీమ్, షాకీర్, యూత్ సభ్యులు పాల్గొన్నారు.