తెలంగాణ లో దివ్యాంగుల సంక్షేమానికి పెద్దపీఠ !

మంత్రి కొప్పుల ఈశ్వర్ !

(J. Surender Kumar)

జగిత్యాల పట్టణం మినీ స్టేడియంలో వికలాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శారీరక అంగ వైకల్యం గల 40 మంది దివ్యాంగులకు ఒక్కో ఒక లక్ష రూపాయల విలువ గల 40 రిట్రో ఫిట్టేడ్ మోటారు వాహనాలు ( మూడు చక్రాల స్కూటీల ) ఆదివారం ఉచిత పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంక్షేమ శాఖ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు.


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…
తెలంగాణ రాష్టం ఏర్పడిన తరువాత దివ్యాంగుల సంక్షేమానికి పెద్దపీఠ వేస్తున్నామన్నారు. గతంలో దివ్యాంగులకు సంవత్సరానికి ₹ 5 కోట్ల బడ్జెట్ ఉంటే ఇప్పుడు దాన్ని 10 రేట్లు పెంచి సంవత్సరానికి దివ్యాంగుల కోసం ₹ 60 కోట్ల రూపాయల కేటాయింపులు చేశాం, దేశంలో ఎక్కడా లేని విధంగా దివ్యాంగుల సంక్షేమానికి తెలంగాణ రాష్టం పెద్ద పీట వేస్తుందని, అందులో భాగంగానే దివ్యాంగులకు నెలకు ₹ 3 వేల రూపాయల పెన్షన్ ఇస్తున్నాం అన్నారు, .దేశంలో ₹3 వేల రూపాయల పెన్షన్ ఏ రాష్టంలో ఇవ్వడం లేదు, సాక్షాత్తు ప్రధాని నరేంద్రమోడీ స్వంత రాష్ట్రం గుజరాత్ లో ₹950 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు అని మంత్రి గుర్తు చేశారు.
దివ్యాంగా సోదరుల ఆశీర్వాదం తెలంగాణ ప్రభుత్వానికి ఉండాలి డిసెంబర్ 3 న జరిగే దివ్యాంగులు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుందాం మంత్రి అన్నారు
దివ్యాంగులు తమ జీవితాల్లో నిలదొక్కుకోవడానికి ప్రభుత్వం వారికి ఫైనాన్సియల్ అసిస్టెటెన్స్ ద్వారా లక్ష, రెండు లక్షల వరకు అందించడం జరుగుతున్నదని మంత్రి అన్నారు
దివ్యాంగుల చట్టం 2016 సెక్షన్ 92 ను పగడ్బందీగా అమలు చేయాలి అని అన్నారు
దివ్యాంగులు, దివ్యాంగా సంఘాలు మంచి సలహాలు, సూచనలు ఇస్తే వాటిని అమలు చేస్తాం అన్నారు .


దివ్యాంగ శాఖ స్త్రీ శిశు సంక్షేమ శాఖలో కలిసి ఉంది, ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడి దీనిని ప్రత్యేక శాఖా గా ఏర్పాటు చేస్తామని మంత్రి అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ప్రతి జిల్లాకు ఒక బ్యాటరీ ఆపరేటెడ్ ట్రై సైకిల్ రిపైరింగ్ సెంటర్ ను ఏర్పాటు చేస్తాం అన్నారు.
ముఖ్యమంత్రి తో మాట్లాడి పీజీ ఉండే వాళ్ళతో పాటు డిగ్రీ ఉన్నవాళ్లకు కూడా స్కూటీ లు ఇస్తున్నామన్నారు
ఈ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జడ్పీ చైర్ పర్సన్ దావా వసంత , మున్సిపల్ ఛైర్ పర్సన్ బోగ శ్రావణి , కలెక్టర్ రవి , RDO మాధురి , DCMS చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి , బుగ్గారం యంపిపి, జడ్పీటీసీ, బాధినేని రాజేందర్ రాజమణి ,, వెల్గటూర్ జెడ్పీటీసీ సుధారాణి తదితరులు పాల్గొన్నారు