భారత్ రాష్ట్ర సమితి పార్టీ తో దేశ రాజకీయాల్లో మార్పు తప్పదు,!

మేయర్ విజయలక్ష్మి

( J. Surender Kumar)

భారత రాష్ట్ర సమితి పార్టీతో   దేశ రాజకీయ లలో సరి కొత్త మార్పు వస్తుందని  గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి  అన్నారు.
ఢిల్లీ లో సర్ధర్ పటేల్ రోడ్  వసంత్ విహార్ లో  ఏర్పాటు చేసిన   భారత రాష్ట్ర సమితి కార్యాలయ ప్రారంభోత్సవ బుధవారం జరిగింది. కార్యక్రమంలో మేయర్ పాల్గొన్నారు
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..  

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటు చేసిన పరిస్థితులు నేడు కూడా   దేశ వ్యాప్తంగా  ఉన్నాయని,  పదమూడేళ్ల పాటు  కఠోర దీక్షతో పోరాడి తెలంగాణ సాధించడమే కాదు, రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ తన పాలనతో దేశం గర్వించదగ్గట్లు పాలనా   అందించినట్లు మేయర్ అన్నారు., 

ఎనిమిదేళ్ల  మోడీ ప్రభుత్వ పాలనలో దేశం లో అన్ని రంగాల్లో వెనుకబడి పోయిందని, మాటలు, పాటలు, గొప్పగా ఉన్నాయి కానీ  ఒక మంచి పని చేయలేకపోయారని మేయర్ ఆరోపించారు,

ప్రధాన ప్రతి పక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ  విఫలమైన  ఈ సందర్భం లో కెసిఆర్ లాంటి నాయకుడి కోసం    దేశం  ఆతృతగా ఎదురు చూసింది  దేశ ప్రజలు కోరుకున్నట్లు గానే  కే సి ఆర్    భారత రాష్ట్ర సమితిని స్థాపించి ఢిల్లీ లో  కార్యాలయం  ప్రారంభించి కొత్త చరిత్ర ను లిఖించడానికి సిద్ధమైన సందర్భంగా హృదయ పూర్వక శుభాకాంక్షలు  తెలిపారు


గౌ.కే సి ఆర్ గారు తాను అనుకున్న లక్ష్యం సాధించే దాకా నిద్ర పోరారని మన కళ్ళ ముందున్న తెలంగాణ  రాష్ట్రమే  సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నది , తెలంగాణ సాధించి నట్లు గానే భారత రాష్ట్ర సమితి పార్టీ   ఏర్పాటు తో  కేసీఆర్ దేశం లో విప్లవాత్మకమైన అద్భివృద్ది సంక్షేమం మార్పులు తెస్తారని  భారత ను  ప్రపంచం లోనే అగ్రగామిగా నిలబెడు తారనే నమ్ముతున్నట్లు మేయర్ అన్నారు

, తెలంగాణ లో మాదిరిగా   దేశం లో   ఉచిత కరెంటు  , సాగు, త్రాగు నీరు అందించడం పేదలు, రైతులు,  మహిళలు  అన్ని వర్గాల ప్రజల కోసం  దేశ వ్యాప్తంగా  అమలు కు కే సి ఆర్ కృషి చేస్తారని మేయర్ ఆశాభావం వ్యక్తం చేశారు.