సీఎం కేసీఆర్ సభను సక్సెస్ చేయాలి.!

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్

(J.Surender Kumar)

ముఖ్యమంత్రి కేసిఆర్ డిసెంబర్ 7న జగిత్యాల్ పట్టణానికి రానున్న సందర్భంలో ఆయన సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ నాయకులు కార్యకర్తలతో ఆదివారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.

పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం మరియు జగిత్యాల అర్బన్ మండల మోతే గ్రామ శివారులో బహిరంగ సభ సందర్భంగా సభను విజయవంతం చేయాలని సారంగాపుర్ మండల ముఖ్యనాయకులు, టీఆరెఎస్ శ్రేణులతో మండల కేంద్రము లోనీ ఫంక్షన్ హాల్ లో సమావేశమై కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.

పార్టీలో చేరికలు..

రాయికల్ మండల అల్లిపూర్ గ్రామానికి చెందిన యూత్ నాయకులు దొబ్బాల వేణుగోపాల్, మరియు
30 మంది యువకులు ప్రభుత్వ అబివృద్ధి,సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుండి టీఆరెఎస్ పార్టీ లో చేరారు. వారికి టీఆరెఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి జ ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ ఆహ్వానించారు.
ఈకార్యక్రమంలో మండల నాయకులు సురేందర్ నాయక్, ఎంపీటీసీ మోర విజయ లక్ష్మి వెంకటేష్ , కో ఆప్షన్ ముఖీద్ ,పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు రత్నాకర్ రావు , యూత్ అధ్యక్షులు ప్రశాంత్ , మండల పార్టీ బీసీ సెల్ ఉపాధ్యక్షులు వెంకటేష్ ,.sc సెల్ గ్రామ అధ్యక్షులు గంగారాం నాయకులు ఎర్రవెని ఆశలు ,చిలుముల అశోక్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పరామర్శ

బీర్పూర్ మండల తుంగురు టీఆరెఎస్ పార్టీ గ్రామ శాక అధ్యక్షులు పిప్పల గంగరాజం ను ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పరామర్శించారు.. కొంతకాలంగా గంగరాజు అనారోగ్యం తో బాధపడుతున్నారు. మండల,గ్రామ నాయకులు తదితరులు ఉన్నారు .