ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి !
(J. Surender Kumar)
రైతులు సొంత పట్టా భూములు ఏ క్షణాన ఎవరి పేరునా మారిపోతాయో? రెవెన్యూ రికార్డులలో ఆ సర్వే నెంబర్లలో ఎవరి పేర్లు చేరుతాయో? తెలియని గందరగోళం రైతాంగంలో నెలకొందని వెంటనే ప్రభుత్వం ధరణి పోర్టల్ రద్దు చేయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సోమవారం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపుమేరకు కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో జగిత్యాల పట్టణంలో భారీ ధర్నా నిర్వహించి తహసిల్ చౌరస్తా వద్ద రాస్తారోకో చేపట్టారు. రైతు సమస్యలపై రుణమాఫీ మొత్తంపేట షుగర్ ఫ్యాన్ వారి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో దోపిడిని అరికట్టడం తదితర అంశాలపై సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి. మెమోరాండం అందజేశారు.