జగిత్యాల జ్యోతి ఐఐటి లోస్టూడెంట్ టాలెంట్ రివార్డ్ టెస్ట్!


(J.Surender Kumar)

జగిత్యాల పట్టణంలోని జ్యోతి ఐఐటి, నీట్ అకాడమీలో జాతీయ గణిత శాస్త్ర దినోత్సవ వేడుకలలో భాగంగా డిసెంబర్ 22 న శ్రీ శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకొని ఆదివారం జ్యోతి STaRT- 2K22 పేరిట స్టూడెంట్ టాలెంట్ రివార్డ్ టెస్ట్ విద్యార్థులకు నిర్వహించారు.

ఈ పరీక్షలో జగిత్యాల జిల్లాలోని పలు గ్రామాలు, మరియు పట్టణాల నుంచి వివిధ ప్రభుత్వ, మరియు ప్రైవేటు పాఠశాలల, విద్యార్థులు పాల్గొన్నారు. ఐదవ తరగతి నుంచి తొమ్మిదవ తరగతి వరకు నిర్వహించిన ఈ పరీక్షలో మొత్తంగా 623 విద్యార్థులు పాల్గొన్నారు. ఇలాంటి పలు పోటీ పరీక్షల్లో పాల్గొనడం తమకెంతో స్ఫూర్తిదాయకమని విద్యార్థులు తమ సంతోషం వ్యక్తం చేశారు. , మునుముందు కూడా పలు రకాల పోటీ పరీక్షలు నిర్వహించి విద్యార్థుల్లోని ఉత్తమ ప్రతిభను గుర్తించడానికి ఎంతగానో కృషి చేస్తామని పాఠశాల యాజమాన్యం బియ్యాల హరిచరణ్ రావు , శ్రీధర్ రావు లు తెలిపారు.  ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు మౌనిక రావు, అజిత రావు, రజిత, పాఠశాల ఉపాధ్యాయ బృందం తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు.