J. Surender Kumar,
నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ నీకు పసుపు రైతుల గోడు కనిపించదా అని నిలదీశారు టిపిసిసి నాయకులు జువ్వడి కృష్ణారావు శుక్రవారం.కోరుట్ల నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలంలోని కోమటి కొండాపూర్ గ్రామంలోని పసుపు రైతుల వ్యవసాయ క్షేత్రాలను సందర్శించిన అనంతరం స్థానిక పత్రిక విలేకరులతో మాట్లాడుతూ రైతు ఒక ఎకరం వ్యవసాయ భూమిలో పసుపు పంట పండించాలంటే ఒక లక్ష ఇరవై వేల పెట్టుబడి పెడుతున్నాడని అలాగే ఎకరానికి 30 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా ఈ సంవత్సరం సరాసరి 12 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వస్తుందని ఈ రకమైన దిగుబడి రావడం వల్ల మార్కెట్లో పసుపు కు మద్దతు ధర లేకపోవడం వల్ల పసుపు పండించిన రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి దాపురించిందని కృష్ణారావు అన్నారు. మండలంలోని కోమటి కొండాపూర్ గ్రామంలో రైతు గడ్డం రవి రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో రైతులు కృష్ణారావుతో తమ గోడు వెళ్ళబోసుకున్నారు.

ఈ సందర్భంగా కృష్ణారావు స్థానిక ఎంపీ ధర్మపురి అరవింద్ ఉద్దేశించి మాట్లాడుతూ 2019 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికల్లో పోటీ చేసిన ప్రస్తుత పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని రైతులకు పసుపు కు మద్దతు ధర ప్రభుత్వం చెల్లించేలా చర్యలు తీసుకుంటామని తాను ఇలా చేయని పక్షంలో తన పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని బాండ్ పేపర్ ద్వారా నాడు ధర్మపురి అరవింద్ నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని రైతులకు హామీ ఇచ్చారని, ఎన్నికల్లో గెలిచి నాలుగు సంవత్సరాలు అయిపోయిందని కేంద్రంలో వారి బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉందని రాష్ట్రంలో బిజెపి తాబేదారు ఆయన కెసిఆర్ నాయకత్వంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉందనికానీ నేటి వరకు మద్దతు ధర కల్పించలేదని పసుపు బోర్డు ఏర్పాటు చేయాలేదని తీవ్రంగా దుయ్యబట్టారు.

అరవింద్ ఇప్పటికైనా కోరుట్ల నియోజకవర్గంలోని రైతుల వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి పసుపు పంట దిగుబడి ఏ విధంగా ఉంది దానికి ధర ఏ విధంగా ఉంది ఒక్కసారి తెలుసుకొని మాట్లాడమని జువ్వడి కృష్ణారావు డిమాండ్ చేశారు ఇలాంటి అసమర్ధ నాయకుల వల్ల రైతుల సమస్యలుతీరవని అబద్ధపు వాగ్దానాలు చేసే నాయకులు తమ పదవులకు రాజీనామా చేయాలని కృష్ణారావు ఎంపీ ధర్మపురి అరవింద్ ను డిమాండ్ చేశారు