ధర్మపురి ఆలయంలోఅంగారక సంకష్టి పూజలు !

J. Surender Kumar.

ధర్మపురి క్షేత్రం శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలో గల వినాయకునికి “అంగారక సంకటహర చతుర్థి” సందర్భంగా గణపతి ఉపనిషత్తులతో అబిషేకం, హరతి, మంత్రపుష్పం పూజాది కార్యక్రమాలు జరిగాయి.

వేదపండితులు పాలెపు ప్రవీణ్ శర్మ , ముత్యాల శర్మ , స్థానిక వేదపండితులు మధు రామశర్మ , అభిషేకం పురోహితులు బొజ్జ సంతోష్ కుమార్, రాజగోపాల్, భక్తులు పాల్గొన్నారు.


నరసింహ స్వామి దర్శించుకున్న నెల్లూరు పీఠాధిపతి!

మంగళవారం ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారినీ నెల్లూరు పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ ఆచార్య శ్రీహరి తీర్థస్వామి నీ దర్శించుకున్నారు.

వీరికి ముందుగా దేవస్థానం సాంప్రదాయం ప్రకారం మేళతాళాలతో స్వాగతం పలికి పూజల అనంతరం అర్చకులు ఆశీర్వచనం తదుపరి శ్రీస్వామి వారి శేష వస్త్రం ప్రసాదం ఇచ్చి సత్కరించారు.


ఈ కార్యక్రమంలో దేవస్థానం వేదపండితులు ముత్యాల శర్మ , ముఖ్య అర్చకులు నంభి శ్రీనివాసాచార్యులు, అర్చకులు నంభి నరసింహ మూర్తి , వామనాచార్య , బొజ్జ సంతోష్ కుమార్, రాజగోపాల్, సముద్రాల వంశీకృష్ణ , సిబ్బంది మరియు వారి శిష్య బృందం పాల్గొన్నారు.