విద్యుత్ A.E మనోహర్..
J. Surender Kumar,
మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశాల మేరకు. ధర్మపురి పట్టణానికి. ప్రత్యేక విద్యుత్తు సబ్ స్టేషన్ ఏర్పాటు ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్టు ధర్మపురి విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ మనోహర్ ప్రకటనలో పేర్కొన్నారు.
మంత్రి సూచన మేరకు శనివారం విద్యుత్ సూపరింటెంట్ ఇంజనీర్ G.సత్యనారాయణ పట్టణంలో నూతన సబ్ స్టేషన్ నిర్మాణ. స్థలం కోసం చింతామణి చెరువు వెనక వైపు, T T D కళ్యాణ మండపం సమీపంలో స్థలం పరిశీలన చేశారని పేర్కొన్నారు.. మున్సిపల్ చైర్ పర్సన్ సంగి సత్తెమ్మ, ఇందారపు రామన్న వైస్ చైర్మన్ , దేవాలయ అభివృధ్ధి కమిటీ సభ్యులు మున్సిపల్ కమీషనర్ , పాల్గొన్నారు.

రానున్న బ్రహ్మోత్సవాలకు విద్యుత్ శాఖ పరంగా చేయవలసిన పనులు, గోదావరి నుండి దేవాలయం పట్టణానికి నీటిసరఫరా చేసే లైన్ ని పునరుద్దరించడం, గతంలో దేవాలయం కోసం వేసి నిరుపయోగంగా ఉండి, రహదారుల వెంట అడ్డంగా ఉన్న కేబుల్ లైను తొలగించడం తదితరా అంశాలపై చర్చించినట్లు వివరించారు. శివరాం D .E, టెక్నికల్ , రాజ బ్రహ్మచారి, ADE, కన్స్ట్రక్షన్ , సింధూర్ శర్మ ADE ధర్మపురి, రవి A E కన్సస్టృక్షన్ , ధర్మపురి మరియు. తదితర సిబ్బంది పాల్గొన్నట్టు ప్రకటనలో పేర్కొన్నారు.