ఈ నెల 30 న చలో హైదరాబాద్ !
MSO’S & LCO’S జాక్ ఆధ్వర్యంలో ..

J. Surender Kumar,

2023 ఫిబ్రవరి 1వ తేదీ నుండి పెరుగుతున్న పే ఛానెల్స్ ధరలకు నిరసనగా, కేబుల్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న ట్రాయ్ (NTO 3) అసంబద్ధ విధానాలను ఖండిస్తూ
MSO’S & LCO’S జాక్ ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీన సోమవారం రోజు హైదరాబాద్, ఇందిరాపార్క్ లో ధర్నా జరగనుంది. ఈ మేరకు వారు ప్రకటన విడుదల చేశారు

తెలంగాణలోని జిల్లా, మండల నాయకులు, Mso’s అందరూ సమిష్టిగా బాధ్యత తీసుకొని అధిక సంఖ్యలో కేబుల్ ఆపరేటర్స్ ను కదిలించి ధర్నా ను విజయవంతం చేయాలని ప్రకటంలో కోరారు.మన కేబుల్ రంగంలోని సమస్యలకు రెండు రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా పరిష్కారాలు లభించడానికి ఈ కార్యక్రమం మంచి వేదిక తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల వేడి మొదలైంది.మన కేబుల్ రంగ బలాన్ని చూపి మన వ్యవస్థకు మేలు చేకూరేలా మన ఉనికికి ఊపిరి పోసేలా అందరూ తమవంతు బాధ్యతగా కృషి చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాము
తెలుగు రాష్ట్రాల మల్టీ సర్వీసెస్ కేబుల్ ఆపరేటర్ల
సంక్షేమ సంఘం ప్రకటనలో కోరారు.