J.Surender Kumar,
ప్రముఖ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన నరసింహ క్షేత్ర దర్శన యాత్ర 8 రాష్ట్రాలలో కొనసాగానున్నదా ? అంటే అవును అనే చర్చ కొనసాగుతున్నది. 32 నరసింహ క్షేత్రాలు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోనే ఈ నరసింహ క్షేత్రాలు ఉన్నాయి. ఈనెల 24న కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి క్షేత్రంలో స్వామివారిని దర్శించుకొని వారాహి వాహనం కు ప్రత్యేక పూజలు చేయించుకున్నారు.. సాయంత్రం ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ని ఆయన . తన ఎన్నికల ప్రచార వాహనం. వారాహి లేకుండానే వాహన శ్రేణితో (కాన్వాయ్) వచ్చి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శించుకున్నారు. హీరో పవన్ కళ్యాణ్, 32 నరసింహ క్షేత్రాల దర్శన ప్రక్రియలో భాగంగా. ధర్మపురి.క్షేత్రంలో శ్రీకారం చుట్టారు అనేది జగమెరిగిన సత్యం..ఈ నేపథ్యంలో మహాన్విత. మహిమగల శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాలు. వివిధ నామాలతో. ఆరు రాష్ట్రాలలో ప్రసిద్ధిగాంచినట్లు శాస్త్ర ప్రామాణికంగా వేద పండితుల వివరిస్తున్నారు.
ఈ క్షేత్రాల దర్శనం వల్ల
ఆపదలను, అపమృత్తయువును తొలగిస్తుంది, విజయాలను ఇస్తుంది అనేది నమ్మకం విశ్వాసం.
ఉగ్రం వీరం మహావిష్ణుం
జ్వలంతం సర్వతోముఖం
నృసింహం భీషణం భద్రం
మృత్యుమృత్యుం నమామ్యహం !
ఇది నారసింహ మృత్యుంజయ మంత్రం,
అనుష్టుప్ ఛందస్సులో ఉంటుంది..
ॐ उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखम् नृसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युं नमाम्यहम् || )
అనుష్టుప్ అంటే అది ఛందస్సు పేరు, 32 అక్షరాలు ఉండే శ్లోకాన్ని అనుష్టుప్ శ్లోకం అంటారు.
మన రాష్ట్రంలో, పక్క రాష్ట్రాల్లో ఉన్న నారసింహ క్షేత్రాలన్నీ కలిపి 32 క్షేత్రాలు ఉన్నాయి
ఆంధ్రాలో…

1) అహోబిలం నరసింహ స్వామి దేవాలయం, 2) కదిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం, 3) వరాహ లక్ష్మీ నరసింహ దేవాలయం, సింహాచలం, విశాఖపట్నం, 4) శ్రీ పానకాల నరసింహ స్వామి దేవాలయం. మంగళగిరి, 5) లక్ష్మీ నరసింహ దేవాలయం, అంతర్వేది, తూర్పు గోదావరి, 6) శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం, వేదాద్రి, చిల్లకల్లు, 7) కేతవరం లక్ష్మీనర్శిమ స్వామి దేవాలయం, గుంటూరు, 8) వేదగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం / నరసింహ కొండ, నెల్లూరు,
తెలంగాణలో..

9) లక్ష్మీ నరసింహ దేవాలయం, యాదాద్రి, 10) వాడపల్లి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం, వజీరాబాద్, 11) మట్టపల్లి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం, సూర్యాపేట,
కర్ణాటకలో..

12) సీబీ నరసింహ స్వామి దేవాలయం, హోబ్లీ, బెల్లావి, కర్ణాటక.13) శ్రీ గురునరసింహ దేవాలయం సాలిగ్రామ, ఉడిపి, 14) మేలుకోటే చలువనారాయణ మరియు యోగ నరసింహ స్వామి, కర్ణాటక 15) దేవరాయనదుర్గ శ్రీ యోగ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం, తుమకూరు, 16) శ్రీ ఆదిశంకరాచార్య శారద లక్ష్మీ నరసింహ పీఠం, చిక్కమగళూరు జిల్లా, 17) శ్రీ నర్సింహ జర్న మందిర్, బీదర్, కర్ణాటక
తమిళనాడులో..

18) శ్రీ యోగ నరసింహ స్వామి దేవాలయం, షోలింగూర్, తమిళనాడు.19) నరసింహస్వామి దేవాలయం, నమక్కల్, .20) పాతాళత్రి నరసింహర్ లేదా ఉగ్ర నరసింహ ఆలయం కాంచీపురం, 21) శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయం, అంతిలి, 22) పరికల్ శ్రీ లక్ష్మీ నరశిమామూర్తి ఆలయం, విల్లుపురం, 23) పూవరసంకుప్పం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం, విల్లుపురం, 24) సింగిరికుడి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం, కడలూరు, 25) శ్రీ శరనారాయణ పెరుమాళ్ ఆలయం/తిరువతిగై నరసింహర్ ఆలయం, కడలూరు, తమిళనాడు.
మహారాష్ట్రలో..

26) కోల్ నర్సింగ్‌పూర్ జ్వాలా నరసింహ ఆలయం, నరసింగ్‌పూర్, మహారాష్ట్ర 27) నీరా నర్సింగపూర్ శ్రీ లక్ష్మీ నర్సింహ దేవాలయం, పూణే, మహారాష్ట్ర 28) శ్రీ నర్సింహ మందిర్ పోఖర్ని, మహారాష్ట్ర
ఒరిస్సాలో…

29) మార్జార కేసరి నరసింహ దేవాలయం, బరాగర్, ఒరిస్సా
30) చక్ర నరసింహ దేవాలయం, పూరి, ఒరిస్సా.
పశ్చిమ బెంగాల్లో..

31) నరసింగపల్లి లార్డ్ నరసింహదేవ ఆలయం దేవపల్లి, పశ్చిమ బెంగాల్
ఉత్తరాఖండ్ లో

32) జ్యోతిర్ మఠం/నర్సింగ్ దేవతా ఆలయం జోషిమత్, చమోలి, ఉత్తరాఖండ్
దేశంలో అత్యధిక నారసింహ క్షేత్రాలు తెలుగు రాష్ట్రాలలోనే ఉన్నాయనడంలో సందేహం లేదు. ఆయా రూపాలలో స్వామి భక్తులను అనుగ్రహిస్తున్నారు.
అయితే స్వామిని ఆయా మంత్రశాస్త్రాలలో 32 రకాలుగా పేర్కొన్నారు.
ఆ రూపాల జాబితా…
1. కృష్ణ నరసింహుడు 2. రుద్ర నరసింహుడు 3. మహా గోర నరసింహుడు 4. భీషణ నరసింహుడు.5. భీమ నరసింహుడు 6. ఉజ్జ్వల నరసింహుడు 7. కరాళ నరసింహుడు 8. వికరాళ నరసింహుడు 9. దైత్యాంక నరసింహుడు 10. మధుసూదన నరసింహుడు 11. రక్తాక్ష నరసింహుడు 12. పింగళాక్ష నరసింహుడు 13. అంజన నరసింహుడు 14. దీప్త తేజ నరసింహుడు 15. విశ్వాక్ష నరసింహుడు 16. రాక్షసాంతక నరసింహుడు 17. విశాఖ నరసింహుడు 18. ధూమ్రకేశ నరసింహుడు 19. హయగ్రీవ నరసింహుడు 20. ధనస్వన నరసింహుడు 21. మేఘనాథ నరసింహుడు 22. మేఘవర్ణ నరసింహుడు 23. కుంభకర్ణ నరసింహుడు 24. తీవ్ర తేజ నరసింహుడు 25. అగ్నివర్ణ నరసింహుడు 26. మహోగ్ర నరసింహుడు 27. విశ్వభూషణ నరసింహుడు 28. విఘ్నక్రమ నరసింహుడు 29. మహాసేన నరసింహుడు 30. సుకోణ నరసింహుడు 31. సుహాను నరసింహుడు.32. శృశాంతక నరసింహుడు.