ఇంటీ పట్టాలు పంపిణీ చేసిన మంత్రి ఈశ్వర్ !

J. Surender Kumar

జగిత్యాల పట్టణ టి ఆర్ నగర్  చెందిన 58 మంది పేదలకు మంగళవారం మంత్రి కొప్పుల ఈశ్వర్ ఇంటి పట్టాలను అందజేశారు. లబ్ధిదారులు G.O.No 58 ద్వారా  దరఖాస్తు చేసుకున్నారు.   ప్రభుత్వం ద్వారా మంజూరైన ఇళ్ళ పట్టాలను జిల్లా కేంద్రం  కలెక్టర్ కార్యాలయం లో లబ్దిదారులకు పంపిణి చేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మేల్యే డా.సంజయ్ కుమార్, ఎమ్మేల్యే విద్యాసాగర్ రావు, జెడ్పీ చైర్ పర్సన్ దావా వసంత సురేష్ , కలెక్టర్ జి రవి నాయక్, అదనపు కలెక్టర్లు బిఎస్ లత, మకరంద మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.


కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ!


సారంగాపూర్ మండలానికి చెందిన 17 మంది కి కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా మంజూరైన 17 లక్షల రూపాయల విలువగల చెక్కులను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మంగళవారం పంపిణీ చేశారు.  మండల కేంద్రంలోనీ రైతు వేదికలో  ఈ కార్యక్రమంలో ఎంపీపీ జమున శ్రీనివాస్, జెడ్పీటీసీ మనోహర్ రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షులు రాజేందర్ రెడ్డి, పాక్స్ ఛైర్మెన్ నరసింహ రెడ్డి, వైస్ ఎంపీపీ సురేందర్ , ఎంపీటీసీ ల ఫోరం సుధాకర్ రావు,కో ఆప్షన్ అమీర్, సోషల్ మీడియా కన్వీనర్ వంశీ, సర్పంచులు, ఎంపీటీసీలు ,ఉప సర్పంచ్ లు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.