జగిత్యాలలో మాజీ సీఎం ఎన్టీఆర్ కు ఘన నివాళి!

తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో..

J. Surender Kumar,

జగిత్యాల జిల్లా కేంద్రంలో టిడిపి వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 27 వ వర్ధంతి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు బుధవారం నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక టవర్ సర్కిల్ వద్ద ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.


బడుగు బలహీన వర్గాలలో రాజకీయ చైతన్యం, పదవులను, ప్రజల ముంగిట పాలన కోసం మండల వ్యవస్థను, తదితర అనేక సంక్షేమ పథకాలు కల్పించిన ఘన చరిత్ర తెలుగుదేశం పార్టీకి, ఎన్టీఆర్ కి దక్కుతుందని ఆ పార్టీ జిల్లా శాఖ అధ్యక్షుడు మహంకాళి రాజన్న అన్నారు.
తదనంతరం స్థానిక వైశ్య భవన్ లో పార్టీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.,


ఈ కార్యక్రమం లో L.శేకర్ . కొండ శ్రీధర్., భార్గవ్. బత్తుల కొండయ్య. రామ్. అక్కినపెళ్లి కాశినాతం. సోమ నారాయణ రెడ్డి. నక్క లక్ష్మణ్ . వుప్పుల రవి., కందుకూరు తిరుపతి విజయకుమార్ , కోయా బాలకృష్ణ, .రవి. R.సత్యం . అరిగెల గంగారెడ్డి. కుంబాల అయిలయ్య. తదితరులు పాల్గొన్నారు.

ధర్మపురి పట్టణంలో..

ప్రముఖ పుణ్యక్షేత్రం, నియోజకవర్గ కేంద్రమైన ధర్మపురి పట్టణంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు వర్ధంతి పురస్కరించుకొని పార్టీ శ్రేణులు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గడ్డం భాస్కర్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ బండారి రాజన్న,, ఆలయ మాజీ ధర్మకర్త సుదవేణి నరస గౌడ్, దళిత నాయకుడు ఉప్పారపు రాజ నరసయ్య, నాయకులు డాక్టర్ వి ఆర్ కె. గుని శెట్టి కాశయ్య, తదితర కార్యకర్తలు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.